ట్రంప్‌పై సంచలన ఆరోపణలు

16 May, 2017 08:44 IST|Sakshi
ట్రంప్‌పై సంచలన ఆరోపణలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై వాషింగ్టన్‌ పోస్ట్‌ సంచలన ఆరోపణలు చేసింది. అమెరికాకు సంబంధించిన అతి కీలకమైన సమాచారాన్ని ట్రంప్‌ రష్యా విదేశాంగ మంత్రి సెర్జెయ్‌ లావ్‌రోవ్‌తో పంచుకున్నారని ఆరోపించింది. గత ఏడాది శ్వేతసౌదంలో ట్రంప్‌ సెర్జెయితో భేటీ అయ్యారని, ఆ సమయంలో ఎవరికీ చెప్పకూడని విషయాన్ని లీక్‌ చేశారంటూ అందులో రాసింది. కాగా, వాషింగ్టన్‌ అలా పేర్కొన్న కొద్ది సేపట్లోనే అమెరికా అధికారులు ఖండించారు. దేశ ప్రధాన కార్యదర్శి రెక్స్‌ టిట్టర్‌సన్‌తోపాటు జాతీయ భద్రతా సలహాదారులు వాషింగ్టన్‌ పోస్ట్‌ అబద్ధాలు చెబుతోందన్నారు.

దేశ భద్రతకు కలిగించే ఏ సమచారాన్ని కూడా రష్యాతో అసలు ట్రంప్‌ పంచుకోలేదని అన్నారు. నేరుగా కాకుండా అమెరికా నిఘా అధికారులు ఉపయోగించే ప్రత్యేక కోడ్‌ భాషలో ఈ సమాచారాన్ని ట్రంప్‌ రష్యాకు లీక్‌ చేసినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది. ఇంటెలిజెన్స్‌ అధికారులు ఈ విషయాన్ని పంచుకోగా దానిని ట్రంప్‌ లీక్‌ చేశారని చెప్పింది. ‘ట్రంప్‌ రష్యా విదేశాంగ రాయబారితో చాలా సమాచారాన్ని పంచుకున్నారు. ఎంతంటే సొంతంగా మన దేశానికి భాగస్వామ్యం ఉన్న దేశాలతో ఎంత సమాచారాన్ని పంచుకుంటామో అంతకంటే ఎక్కువగా’ అని కూడా అది వెల్లడించింది.

ఉగ్రవాదంతో వస్తున్న సమస్యలపై ట్రంప్‌, రష్యా విదేశాంగ రాయబారి సెర్జయితో భేటీ అయ్యారు. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేలా ట్రంప్‌ రష్యా సహాయం తీసుకున్నారని, అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ జోక్యం చేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కోవడంతోపాటు ఎఫ్‌బీఐ దర్యాప్తు కూడా చేస్తున్న విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు