అమెరికా షట్‌డౌన్‌ ముగిసింది

10 Feb, 2018 10:39 IST|Sakshi
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (ఫైల్‌ ఫోటో)

వాషింగ్టన్‌ : అమెరికా షట్‌డౌన్‌ ముగిసింది. ప్రభుత్వ కార్యకలాపాలు తిరిగి తెరుచుకున్నాయి. బడ్జెట్‌ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేయడంతో కార్యకలాపాలు యథావిధిగా మళ్లీ ప్రారంభమయ్యాయి. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం ఆలస్యం కావడంతో.. 5 గంటపాటు అమెరికా ప్రభుత్వం కార్యకలాపాలు స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మూతపడకుండా ఉండేందుకు గురువారం అర్ధరాత్రిలోగా బిల్లును కాంగ్రెస్‌ ఆమోదించాల్సి ఉండగా.. సెనేట్‌లో ఆలస్యం జరిగింది. సెనేట్‌ 71-28 ఓట్ల తేడాతో, ప్రతినిధుల సభ 240-186 ఓట్ల తేడాతో దీన్ని ఆమోదించింది.

''బిల్లుపై సంతకం చేశా. మా మిలటరీ ముందు కంటే చాలా బలమైనదిగా ఉంది. మేము మిలటరీని ప్రేమిస్తాం. ప్రతిఒక్కటీ అందిస్తాం. చాలా కాలంలో తొలిసారి ఇది జరిగింది. జాబ్స్‌..జాబ్స్‌..జాబ్స్‌!'' అని డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం ఓ ట్వీట్‌ చేశారు. శుక్రవారం ఉదయం ఈ బిల్లుపై డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. అంతకముందు జనవరిలో కూడా ఓసారి ఇలానే అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ అయింది. హౌజ్‌లో బిల్లుకు మద్దతు ఇచ్చిన 73 మంది డెమొక్రాట్లకు ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు