వ్యక్తిగత సహాయకురాలికి ఉద్వాసన

31 Aug, 2019 16:16 IST|Sakshi

మడేలీన్‌ వెస్టర్‌హౌట్‌ను పదవి నుంచి తొలగింపు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగత సహాయకురాలైన మడేలీన్‌ వెస్టర్‌హౌట్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్టు వైట్‌హౌస్‌ ప్రకటించింది. ఆమె ఇకపై వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా, అధ్యక్ష కార్యాలయానికి సంబంధించిన కీలక సమాచారాన్ని మడేలీన్‌ బహిర్గతం చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అంతేగాకుండా, ఓ ప్రెస్‌మీట్‌లో ట్రంప్‌ కుటుంబ సభ్యులకు సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్‌ చేశారు. 

ట్రంపు కుమార్తె టిపానీ అధిక బరువు కారణంగా ఆయన తన కుమార్తె ఫోటోను చూడడానికి కూడా ఇష్టపడేవారు కాదని మడేలీన్‌ అన్నట్లు తెలిసింది. దీంతో, ఆమెపై వేటు పడినట్టు వైట్‌హౌస్‌ ప్రకటిచింది.  అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ 2016లో బధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ట్రంప్‌ వ్యక్తిగత సహాయకురాలిగా ఆమె పనిచేస్తున్నారు. మడేలీస్‌ పనితీరుపై ట్రంప్‌ అనేక సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. మడేలీస్‌ను పదవి నుంచి తొలగించడం పట్ల ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు రిపబిక్లన్‌ పార్టీ నేతలు కూడా ఒకింత విస్మయానికి గురవుతున్నారు.

దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ కుమార్తెలంటే తనకు ఎనలేని ప్రేమని విలేకరుల సమావేశంలో తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను  ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ అంశం పై వెస్టర్‌హౌట్‌ తో మాట్లాడానని.. ఆమె చాలా ఆవేదనలో ఉన్నారని, అనుకోకుండా జరిగిన సంఘటనని అన్నారు. విలేకరుల విందులో భాగంగా అలా మాట్లాడారని, ఆ సమయంలో మద్యం కూడా సేవించినట్లు మడేలిన్ తనతో చెప్పారని ట్రంప్‌ అన్నారు.
 

మరిన్ని వార్తలు