బాగ్దాదీని తరిమిన కుక్క 

30 Oct, 2019 01:28 IST|Sakshi

బాగ్దాదీని తుదముట్టించడంలో బలగాలకు సాయంగా ఉన్న శునకం ‘కే–9’ఫొటోను అధ్యక్షుడు ట్రంప్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. రహస్య సొరంగం చివరికి వెళ్లిన బాగ్దాదీ తనను తాను పేల్చేసుకోవడంతో ‘కే–9’ స్వల్పంగా గాయపడింది. ‘బాగ్దాదీ కోసం చేపట్టిన ఆపరేషన్‌లో కే–9 పేరున్న ఈ కుక్క అద్భుత పనితీరు చూపింది’అంటూ బెల్జియన్‌ మలినోయిస్‌ జాతికి చెందిన ఆ కుక్కపై ట్విట్టర్‌లో ప్రశంసలు కురిపించారు. ఆ శునకం పేరు, ఇతర వివరాలు వెల్లడించలేదు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు