ఇరాన్‌తో వ్యాపారం చేస్తే మాతో రద్దు

8 Aug, 2018 02:07 IST|Sakshi

టెహ్రాన్‌: అణు ఒప్పందం రద్దు తర్వాత ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు మళ్లీ మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఇరాన్‌తో ఏ దేశమైనా వ్యాపారం చేస్తే, ఆ దేశంతో అమెరికా తన వ్యాపారాన్ని నిలిపేస్తుందని ట్రంప్‌ హెచ్చరించారు. ‘ఇరాన్‌పై మరింత సమర్థవంతమైన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

నవంబర్‌లో వాటి స్థాయి మరింత పెరుగుతుంది. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశం మాతో వారి వాణిజ్యాన్ని నిలిపేయాల్సి ఉంటుంది. ప్రపంచ శాంతి కోసమే నేను ఇదంతా చేస్తున్నాను’ అని ట్రంప్‌ ట్విటర్‌లో హెచ్చరించారు. ఆ వెంటనే జర్మన్‌ కార్ల తయారీ కంపెనీ డైమ్లర్‌.. ఇరాన్‌తో తన కార్యకాలాపాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ట్రంప్‌ నిర్ణయంపై ఇరాన్‌ ప్రజల్లో కోపం, భయం, దిక్కారం వ్యక్తమవుతున్నాయి. 

మరిన్ని వార్తలు