బ్రిటన్‌ రాణి రథం కావాలంటున్న ట్రంప్‌!

17 Apr, 2017 03:37 IST|Sakshi
బ్రిటన్‌ రాణి రథం కావాలంటున్న ట్రంప్‌!

లండన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బ్రిటన్‌ పర్యటనకు వెళ్లినప్పుడు రాణి ఉపయోగించే బంగారు వర్ణపు వాహనంలో ప్రయాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీనివల్ల ఆయనకు భద్రత కల్పించడం మరింత కష్టమవుతుందని లండన్‌లోని భద్రతాధికారులు పేర్కొంటున్నారు.

ట్రంప్‌ను బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌కు తీసుకెళ్లడానికి అధిక భద్రతా సౌకర్యాలతో కూడిన ప్రత్యేక వాహనం ఉంది. కానీ ఆ వాహనం కాకుండా రాణి వాడే గుర్రాల రథంలోనే ట్రంప్‌ను బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌కు తీసుకెళ్లాలని వైట్‌హౌస్‌ వర్గాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే ట్రంప్‌కు పెద్దఎత్తున ముప్పు ఉండటంతో బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌కు దారితీసే రోడ్డు పొడవునా భారీ భద్రతను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తనుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో ట్రంప్‌ బ్రిటన్‌లో పర్యటించే అవకాశం ఉంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు