'నాన్న పరిపాలిస్తాడు.. మేం బిజినెస్ చేస్తాం'

14 Nov, 2016 11:04 IST|Sakshi
'నాన్న పరిపాలిస్తాడు.. మేం బిజినెస్ చేస్తాం'

వాషింగ్టన్: తన తండ్రి ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతామని వచ్చిన వార్తలను అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వారసులు తోసిపుచ్చారు. అందుకు బదులుగా తాము రియల్ ఎస్టేట్ బిజినెస్ చూసుకుంటామని చెప్పారు. ఓ టీవీ చానెల్తో ఇంటర్వ్యూ సందర్భంగా ట్రంప్ కుమారుడు ఎరిక్, కుమార్తె ఇవాంక మాట్లాడుతూ తాము తమ తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటామని తెలిపారు. తాము ఇది తమ తండ్రికి సేవ చేసేందుకు వచ్చిన అదృష్టంగా భావిస్తామని చెప్పారు. న్యూయార్క్ లోనే ఉంటామని, బిజినెస్ చూసుకుంటూ తమ తండ్రి ట్రంప్ తలెత్తుకునేలా చేస్తామని చెప్పారు.

తమకు అద్భుతమైన కంపెనీ ఉందన్నారు. తనకు మాత్రం వేతన సమానత్వం, పిల్లల సంరక్షణ అంశాలు చాలా ముఖ్యమైనవని ఇవాంక ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. అలాగే తనకు విద్యారంగం అంటే అమితమైన ఆసక్తి అని, ఇందులో మహిళలను ఎక్కువగా ప్రమోట్ చేస్తానని తెలిపింది. దీంతోపాటు తాను దృష్టిపెట్టాల్సిన అంశాలు చాలా ఉన్నాయని చెప్పింది. తమ దేశం చాలా బలహీన పరిస్థితుల్లో నడుస్తోందని, తాము రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హోటల్ ఆక్యుపెన్సీ గురించి తాను పెద్దగా పట్టించుకోనని, మేం చేయబోయేదానితో పోలిస్తే ఇదొక చిన్న అంశమని పేర్కొంది. ప్రజా ఆరోగ్యం గురించి చూసుకుంటూ ప్రజలను మంచి పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు