333మంది సైనికులకు అరెస్టు వారెంట్లు !

29 Nov, 2017 14:52 IST|Sakshi

అంకారా(టర్కీ): గత ఏడాది తిరుగుబాటు ప్రయత్నం నేపథ్యంలో అనుమానితులపై ఎర్డోగన్‌ ప్రభుత్వ చర్యలు ఇంకా కనసాగుతూనే ఉన్నాయి. తిరుగుబాటుకు సహకరించారనే ఆరోపణలపై ప్రస్తుతం దాదాపు 333 మంది సైనికులకు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అమెరికాలో అజ్ఞాత జీవితం గడుపుతున్న మత గురువు ఫెతుల్లా గులెన్‌ తమ ప్రభుత్వంపై తిరుగుబాటుకు ప్రోత్సహించారని అధ్యక్షుడు ఎర్డోగన్‌ ఆరోపిస్తున్నారు.

 ఈ కారణంగానే ఇప్పటి వరకు 50వేల మందిని అరెస్టు చేయటంతోపాటు లక్షమందికి పైగా సైనికులు, ఉద్యోగులను తొలగించారు. ఇప్పటికీ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వారెంట్లు జారీ అందుకున్న వారిలో 333 మంది సైనికులు, 27 మంది సాధారణ పౌరులు ఉన్నారు. వీరంతా గులెన్‌ తరపున రహస్య ఇమామ్‌లుగా పని చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది.

ప్రభుత్వ వ్యతిరేకులకు వీరు సమాచారం అందిస్తున్నారని అంటోంది. కాగా, ఇటీవల వారెంట్లు అందుకున్న వారిలో కొందరిని ఇప్పటికే ప్రభుత్వం అదుపులోకి తీసుకుందని సమాచారం.

మరిన్ని వార్తలు