టర్కీ ఫొటోగ్రాఫర్‌ భావోద్వేగ పో​స్ట్‌..

20 Jan, 2020 10:59 IST|Sakshi

అంకారా: సోషల్‌ మీడియాలో టర్కీష్‌ ఫొటోగ్రాఫర్‌ ఉగుర్ గాలెన్కు భావోద్వేగ పూరిత ఫోటో సంచలనం రేపుతోంది. ప్రపంచంలో అన్ని దేశాలు ఈ గ్రహంలో నివసిస్తున్నప్పటికీ పాశ్చాత్య దేశాలు, మిగతా దేశాలకు ఉన్న వ్యత్యాసాలను వివరించిన తీరు అద్భుతమని నెటిజన్లు అభినందిస్తున్నారు. గాలెన్కుకు సంబంధించిన ఫొటోను డాక్టర్‌ సారా హుమర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. విశ్వవ్యాప్తంగా నెలకొన్న విభిన్న పరిస్థితులను ఒకే దృశ్యం ద్వారా చిత్రీకరించారని సారా తెలిపారు.​​​​ ప్రపంచంలో కొన్ని దేశాలు అధిక ఆహారం, అభివృద్ది, సామరస్యతతో వెలుగుతుంటే మరికొన్ని దేశాలు పేదరికం, ఆహార లభ్యత, హింస తదితర అంశాలతో బాధపడుతున్నాయని వీడియో ద్వారా తెలుస్తోంది.

పాశ్చాత్య దేశాలలో వినియోగదారులు, నిరుపేద దేశాలలో ప్రజలు ఏ విధంగా నివసిస్తున్నారో ఈ వీడియో ద్వారా అద్భుతంగా వివరించారు. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ..ప్రపంచంలోని కొన్ని దేశాలు మనుషులను చంపడానికి ఉపయోగపడే యంత్రాలను తయారు చేస్తున్నారని..ఈ యంత్రాల వల్ల ప్రజల మధ్య విద్వేషపూరిత వాతావరణం నెలకొంటుందని ఆరిఫ్‌ ఆయూబ్‌ అనే నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. పాశ్చాత్య దేశాలు తమ సైనిక శక్తి, ఆర్థిక ప్రణాళికల ద్వారా వెనకబడిన దేశాలను బానిసలుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని మహమ్మద్‌ ఉపాలా అనే మరో నెటిజన్‌ అభిప్రాయపడ్డాడు.

కొన్ని దేశాలు మానవుల హక్కుల గురించి మాట్లాడుతుంటే, మరికొన్ని వాటిని ఉల్లంఘిస్తున్నాయని, ఒకరు న్యాయం గురించి మాట్లాడుతుంటే మరికొందరు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారని ఖాన్‌ అనే నెటిజన్‌ తెలిపారు. ఈ భావోద్వేగ అంశాన్ని ప్రపంచానికి చూపించినందుకు మిన్నట్‌ అలీ అనే నెటిజన్‌ తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. ఈ వీడియోకు 30 లక్షలపైగా ప్రజలు వీక్షించారని ట్విటర్‌ అభినందించడం విశేషం.
చదవండినెమలి ఆర్డర్‌ చేస్తే టర్కీ కోడి వచ్చింది..!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు