'అది చెప్పలేను.. గుండె చివుక్కుమంది'

7 Sep, 2015 09:38 IST|Sakshi
'అది చెప్పలేను.. గుండె చివుక్కుమంది'

టర్కీ: 'విధుల్లో భాగంగా మధ్యదరా సముద్ర తీరానికి వెళ్లిన నాకు అలలు ఎగిసిపడుతుండగా ఇసుకలో ఓ మూడేళ్ల బాలుడు కదలకుండా పడిఉండి కనిపించాడు. సముద్రంవైపే ముఖం పెట్టి ఉండగా అతడిని అప్పుడప్పుడు అలలు తాకి వెళుతున్నాయి. ఆ బాలుడిలో మాత్రం చలనం లేదు. నేను ఆ బాలుడిని సమీపిస్తున్నాను. మనసులో గట్టిగా ప్రార్థించాను. భగవంతుడా ఆ బాలుడు ప్రాణాలతో ఉండాలని.. కానీ అలా జరగలేదు. అతడు ప్రాణాలతో లేడని అర్థమై గుండె చివుక్కుమంది'

'లోపలే ఏడ్చేశాను. మనసులో ఎంత ఇబ్బందిపడ్డానో నాకే తెలియదు. నా సొంత కొడుకే అన్నంత భావన కలిగింది' అని ఇటీవల సిరియా నుంచి ప్రాణభయంతో మధ్యదరా సముద్రం గుండా వచ్చి ప్రాణాలు కోల్పోయిన మూడేళ్ల బాలుడు అయలాన్ కుర్దీ గురించి అతడిని చేతుల్లోకి మొట్టమొదటిసారి తీసుకున్న మెమెట్ క్లిపాక్ అనే పోలీసు చెప్పాడు. తనకు ఆరేళ్ల బాలుడు ఉన్నాడని, అయలాన్ మొదటి చూసినప్పుడు నా స్థానంలో తన తండ్రి ఉంటే ఎంతటి భావోద్వేగానికి లోనవుతాడో అంతగా తాను అయ్యానని ఆ క్షణం మాటల్లో వర్ణించలేనని తెలిపాడు.
 

>
మరిన్ని వార్తలు