‘మరణంలోనూ బంధం కొనసాగింది’

22 Apr, 2019 15:21 IST|Sakshi

‘నిళంగ చాలా స్మార్ట్‌. ప్రతిభావంతురాలు. నిజానికి ఈ లక్షణాలు కలిగి ఉండటం కంటే కూడా వాళ్ల అమ్మ శాంతా మయదున్నె కారణంగానే కాలేజీలో తను పాపులర్‌ అయింది. వాళ్లిద్దరు ఇకలేరనే విషయం తెలియగానే షాక్‌ గురయ్యాను. నిళంగా నీకు.. మీ అమ్మ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అంటూ శ్రీలంక బాంబు పేలుళ్లలో మరణించిన తన స్నేహితురాలికి రాధా అనే యువతి నివాళులు అర్పించారు. ఈస్టర్‌ పర్వదినాన శ్రీలంకలోని ప్రముఖ చర్చిలు, హోటళ్లలోని విదేశీయులే లక్ష్యంగా బాంబు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా షాంగ్రీ లా హోటల్‌లో సంభవించిన పేలుళ్లలో శ్రీలంక టీవీ సెలబ్రిటీ చెఫ్‌ శాంతా మయదున్నెతో పాటు, ఆమె కూతురు కూడా మృత్యువాత పడ్డారు. మరణించడానికి కొన్ని నిమిషాల ముందు కూతురుతో కలిసి ఆమె తీసుకున్న సెల్ఫీ చూసి వారి బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్నేహితుల్లా మెలిగే తల్లీకూతుళ్లు మరణంలోనూ అనుబంధాన్ని కొనసాగించారంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు.

కాగా శ్రీలంకలో లైవ్‌ టెలివిజన్‌ కుకింగ్‌ షో నిర్వహించిన మొదటి మహిళగా శాంత మయదున్నె నిలిచారు. తమ అభిమాన సెలబ్రిటీ దుర్మరణం పట్ల పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇక ఆదివారం జరిగిన శ్రీలంక వరుస పేలుళ్లలో మృతులు సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఎనిమిది చోట్ల జరిగిన ఈ బాంబు పేలుళ్లలో 290 మంది మరణించగా, 450 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో భారతదేశానికి చెందిన పలువురు మహిళలు, జేడీఎస్‌ నాయకులు కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విమానం పైకెక్కి వ్యక్తి హల్‌చల్‌

మెక్సికన్‌ గల్ఫ్‌లో అరుదైన షార్క్‌ చేప..

సెలబ్రిటీల స్వర్గమేమో కదా అదీ!

పాక్‌ ప్రధానిని అవమానించిన అమెరికా

‘థ్యాంక్‌ గాడ్‌.. ఆ బాలుడు చేపకు చిక్కలేదు’

ఆ సరస్సులో దిగారా.. ఇక అంతే!

పాక్‌ ప్రధాని ప్రసంగం.. నినాదాలతో రచ్చరచ్చ!

ఇక ద్రవాలూ అయస్కాంతాలే!

కీళ్ల కదలికలతోనూ విద్యుత్తు...

మొసలికి చిప్‌..

నకిలీ ఉద్యోగాల ఉచ్చులో భారతీయులు

అమెరికాలో పూజారిపై దాడి

అమెరికా డ్రీమ్స్‌ కరిగిపోతాయా?

చైనా బలహీనతకు ట్రేడ్‌వార్‌ కారణమా?

అమెరికాలో స్వామీజీపై దాడి

జలుబు మంచిదే.. ఎందుకంటే!

వేడితో కరెంటు

ఆధిపత్యపోరులో భారతీయులు బందీలు

నాడూ రికార్డే.. నేడూ రికార్డే

ముసలి మొహం ప్రైవసీ మాయం!

వీవీఐపీ టాయిలెట్స్‌.. పేలుతున్న జోకులు

రూ.72 లక్షల జరిమానా.. జీవితకాల నిషేధం

ట్రంప్‌పై మిషెల్లీ ఒబామా ఆగ్రహం

సింగపూర్‌లో శాకాహార హోటల్‌

ఆ మినిస్ట్రీ టాయిలెట్లకు బయోమెట్రిక్‌ మెషిన్లు! 

గతంలో కూడా అరెస్టయ్యాడు కదా: అమెరికా

పాక్‌కు భారీ నష్టం.. భారత్‌కు డబుల్‌ లాస్‌

ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీ! 

ఆమె వచ్చింది.. అతన్ని చితక్కొట్టింది

ఫ్రెంచ్‌ కిస్‌తో డేంజర్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌