యోగా వీడియోలో న‌గ్నంగా టీవీ యాంక‌ర్!

9 Jun, 2020 15:09 IST|Sakshi

న్యూయార్క్: ప్ర‌ముఖ‌ టీవీ యాంక‌ర్, న్యూయార్క్ గ‌వ‌ర్న‌ర్ ఆండ్రూ క్యుమో త‌మ్ముడు క్రిస్ క్యూమోకు చేదు అనుభవం ఎదురైంది. త‌న భార్య సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన‌ యోగా వీడియోలో అత‌ను న‌గ్నంగా క‌నిపించాడు. న్యూయార్క్‌లోని హాంప్ట‌న్ మాన్ష‌న్  గార్డెన్‌‌లో క్రిస్ భార్య‌ క్రిస్టినా గ్రీవెన్ క్యుమో యోగా చేస్తుంది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో క్రిస్ గార్డెన్‌లోకి న‌గ్నంగా వ‌చ్చి అటువైపు తిరిగి నిల‌బ‌డ్డాడు. దీన్ని గ‌మ‌నించని అత‌ని భార్య ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో నేరుగా పోస్ట్ చేసింది. దీంతో ఒక్క క్ష‌ణం బిత్త‌రపోయిన నెటిజ‌న్లు 'న‌గ్నంగా నిల్చుని ఉంది యాంక‌ర్‌ క్రిస్ క‌దూ..' అంటూ అత‌డిని గుర్తుపట్ట‌డం మొద‌లుపెట్టారు. (అధ్య‌క్షుడితో వీడియో కాన్ఫ‌రెన్స్‌: న‌గ్నంగా ప్ర‌త్య‌క్షం)

వెంట‌నే నాలుక్క‌రుచుకున్న స‌ద‌రు మ‌హిళ ఆ వీడియోను డిలీట్ చేసింది. కానీ అప్ప‌టికే ఆ వీడియోను స్క్రీన్‌షాట్లు తీసి పెట్టుకున్న నెటిజ‌న్లు‌ క్రిస్ ఫొటోల‌ను తిరిగి పోస్ట్ చేయ‌డంతో 49 ఏళ్ల యాంక‌ర్ ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్‌గా మారాయి. ఇదిలా వుండ‌గా క్రిస్ క్యుమోకు మార్చి 31న క‌రోనా పాజిటివ్ అని తేలింది. లాక్‌డౌన్ పుణ్యాన‌ గ‌తంలోనూ ఇలాంటి వింత‌ సంఘ‌ట‌న‌లు వెలుగుచూశాయి. ఓ రిపోర్ట‌ర్ హెయిర్ క‌ట్స్ కోసం చెప్తుండ‌గా ఆ వీడియోలో ఆమె భ‌ర్త బ‌ట్ట‌లు లేకుండా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. గ‌త నెల‌లో బ్రెజిల్ అధ్య‌క్షుడు స‌హా ప‌లు అధికారు‌లు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశ‌మ‌వ‌గా అందులో ఓ వ్య‌క్తి న‌గ్నంగా క‌నిపించాడు. దీంతో వెంట‌నే అత‌డిని స‌మావేశం నుంచి తొల‌గించారు. (పుట్టగానే ఆ బిడ్డ చేసిన పనికి డాక్టర్లే‌ షాక్)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా