9/11 ఎఫెక్ట్‌.. ఆ హీరో కన్నుమూత

19 Mar, 2018 17:42 IST|Sakshi
థామస్‌ ఫెలాన్‌ (పాత చిత్రం)

మాన్‌హట్టన్‌ : 2001 సెప్టెంబర్ 11వ తేదీ.. అమెరికా దేశ చరిత్రలో చీకటిమయమైన దినం ప్రపంచ దేశాలకు కూడా గుర్తుండిపోయింది. బిన్‌ లాడెన్‌ నేతృత్వంలోని అల్ కాయిదా ఉగ్రవాదులు అమెరికన్‌ విమానాలను హైజాక్ చేసి, వాటితో ట్విన్ టవర్స్‌, రక్షణ కార్యాలయం పెంటగాన్‌లపై దాడులకు పాల్పడ్డారు. అయితే సుమారు 3వేల మందిని బలీతీసుకున్న ఈ మారణ హోమ ప్రభావం ఇప్పటికీ అమెరికాను నీడలా వెంటాడుతూనే ఉంది.    9/11 దాడి.. అరుదైన ఫొటోలు

దాడుల తర్వాత పేలుళ్ల పదార్థాల నుంచి వెలువడిన విషవాయువుల ప్రభావంతో దీర్ఘకాలిక వ్యాధులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాటిల్లో చాలా మట్టుకు అంతుచిక్కని వ్యాధులే ఉండటంతో శాస్త్రవేత్తలు సైతం పరిష్కారాలు కనిపెట్టలేక తలలు పట్టుకుంటున్నారు. అదిగో అలాంటి బాధితుల్లో ఒకరైన థామస్‌ ఫెలాన్‌ (45) ఇప్పుడు కన్నుమూశారు. ఫెలాన్‌ ఆషామాషీ వ్యక్తి కాదు. ఆ ఘోర కలి నుంచి వందలాది మందిని రక్షించిన ఓ అధికారి ఆయన. 

థామస్‌ ఫేలాన్ న్యూయార్క్‌ ఫెర్రీ కెప్టెన్‌. దాడి జరిగిన రోజున విధుల్లో ఉన్న ఆయన అప్రమత్తమై.. మాన్‌హట్టాన్‌ దిగువ ప్రాంతం నుంచి వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. ఆయన సాహసానికి మెచ్చి ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. ఆ తర్వాత ఫెర్రీ విభాగం నుంచి ఫైర్‌ అధికారికిగా ఆయన బదిలీ అయ్యారు. రెండేళ్ల క్రితం ఆయనకు కాన్సర్‌ సోకినట్లు వైద్యులు వెల్లడించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన మృతి చెందారు. ఆ సమయంలో వెలువడిన విషవాయువులతో ఆయనకు కాన్సర్‌ సోకినట్లు వైద్యులు వెల్లడించారు.

ట్విన్‌ టవర్స్‌పై దాడి తర్వాత వెలువడిన దుమ్ము, ధూళి, ఇతర వాయువుల ప్రభావంతో ప్రత్యక్ష సాక్ష్యులు, సహాయక సిబ్బంది, ఘటన అనంతరం శకలాలను శుభ్రం చేసిన సిబ్బంది.. ఇలా సుమారు 50 వేల మంది ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడ్డట్లు అధికారులు చెబుతున్నారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫేస్‌బుక్‌కు షాక్ ‌: ఇన్‌స్టాగ్రామ్‌ ​కో ఫౌండర్స్ గుడ్‌బై

అరుదైన గౌరవం.. అంతలోనే అపఖ్యాతి

పొట్ట తీసేసేముందు ఒక్కసారి బిర్యానీ తింటా!!

ఐరాసకు ఆ హక్కు లేదు

భారత్‌ అంటే నాకెంతో ఇష్టం: ట్రంప్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాఖీ సావంత్‌ షాకింగ్‌ నిర్ణయం

ఈ వారం తర్వాత ఏ కాశీకో వెళ్లిపోతా: నాని

బాలనటిగా యువరాజ్‌సింగ్‌ భార్య

‘నా చిట్టితల్లి.. ఎప్పుడూ ఇలాగే ఉండాలి’

ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్న చై-సామ్‌!

మెగాస్టార్‌ టైటిల్‌తో చరణ్‌..!