200 ట్విట్టర్‌ ఖాతాలు బ్యాన్‌

29 Sep, 2017 12:32 IST|Sakshi

శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా 2016  అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కొన్న  వివాదం మరింత  ముదురుతోంది.  ఈ ఎన్నికల్లో మాస్కో జోక్యంపై దర్యాప్తు నేపథ్యంలో  మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ 200 ఖాతాలను నిషేధించింది.   వీటిని నకిలీ ఖాతాలను గుర్తించి  తొలగించినట్లు  సంస్థ  ప్రకటించింది.  విచారణలో భాగంగా ఈ చర్య తీసుకున్నామని,  పరిశోధన బృందంతో సహకరించనున్నట్టు ట్విట్టర్‌ వెల్లడించింది.  

స్పామ్ నియమాలను ఉల్లంఘించినందుకు,  రష్యా ఆధారిత రెండు వందలకుపైగా ట్విట్టర్‌ ఖాతాలను తొలగించినట్టు వెల్లడించింది. మాస్కో ప్రభుత్వంతో లింకులు తో టెలివిజన్ గ్రూప్  ఆర్‌టీ 274,000 డాలర్లు ఖర్చు చేసినట్లు ట్విట్టర్ తెలిపింది. వీటిని ఎన్నికలనుప్రభావితం చేసేందుకు వాడి ఉండవచ్చనే అనుమానాలను వ్యక‍్తం చేసింది.

ఇంటెలిజెన్స్ అండ్ హౌస్ పెర్మనెంట్ సెలెక్ట్ కమిటీ ప్రతినిధితో  ట్విటర్ వైస్ ప్రెసిడెంట్ కోలిన్ క్రోవ్ సమావేశమయ్యారు. ఇంటెలిజెన్స్‌ అధికారిని కలిశారు2016  అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యంపై  విచారణకు సంబంధించి కాంగ్రెస్  కమిటీలతో చర్చలు జరుగుతున్నాయని  తెలిపింది.  ఈ అంశం విచారణలో ఉన్న కారణంగా,  పరిశోధకులతో తాము ఏమి  చర్చించిందీ బహిరంగంగా భాగస్వామ్యం చేయలేమంటూ ట్వీట్‌ చేసింది.

కాగా ఇదే వ్యవహారంలో మరో  సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కూడా తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటోంది.  అలాగే   ఫేస్‌బుక్‌ లాంటి ప్లాట్‌ఫాంలు యాంటి  ట్రంప్‌ వైఖరి  అవలంబిస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌   ఇటీవల ట్విట్టర్‌లో మండిపడిన సంగతి  తెలిసిందే.

మరిన్ని వార్తలు