ఈ సీఈవో సేవలు ఉచితం...!

17 Apr, 2016 01:09 IST|Sakshi
ఈ సీఈవో సేవలు ఉచితం...!

ట్వీటర్ సీఈవో జాక్ డార్సీ ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోవడం లేదు. అయితే తన వ్యక్తిగత, నివాస భద్రత కోసం మాత్రం రూ. 46 లక్షలు తీసుకుంటున్నారట. ఆయన కంటే ముందున్న సీఈవో డిక్ కాస్టోలో రూ. 62 లక్షల జీతం తీసుకున్నారు. అందులో వేతనంతో పాటు కారు సర్వీసు, సెక్యూరిటీ ఖర్చులన్నీ ఉన్నాయి. ప్రస్తుతం ట్వీటర్‌కు దాదాపు 30 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. అయితే ఫేస్‌బుక్‌కు మాత్రం ఏకంగా 150 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. దీంతో మార్కెటింగ్ వర్గాలు కూడా ట్వీటర్ కంటే ఫేస్‌బుక్ వైపే మొగ్గు చూపుతున్నారు.

ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి 30.7 కోట్ల మంది యూజర్లు ఉండగా, ఈ త్రైమాసికం చివరకు 30.5 కోట్ల మంది ఉన్నారు. యూజర్లు పెద్దగా పెరగకపోవడంతో ట్వీటర్ షేరు ధర కూడా దాదాపు 13 శాతం వరకు పడిపోయిందని టెక్ క్రంచ్ తెలిపింది. ట్వీటర్‌లో చాలా మార్పులు చేయాలని అనుకుంటున్నామని, ప్రస్తుతమున్న 140 క్యారెక్టర్ల పరిమితి ఇబ్బందిగా ఉందని, అయితే దానివల్ల తక్కువ మాటల్లో బలమైన స్టేట్‌మెంట్లు ఇవ్వడానికి కూడా వీలవుతోందని డోర్సి అన్నారు. దీనివల్లే ట్వీటర్‌కు విభిన్నమైన గుర్తింపు కూడా వస్తోందని తెలిపారు.

మరిన్ని వార్తలు