ట్రంప్‌ ఆరోపణలపై ట్విటర్‌ సీఈఓ స్పందన

6 Jun, 2020 14:30 IST|Sakshi

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్ల మధ్య వార్‌ కొనసాగుతోంది. ట్విటర్‌ తీసుకునే నిర్ణయాలు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉండటంతో ఆయన మండిపడుతున్నారు. జూన్‌ 3వ తేదీన జార్జ్‌ ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలంటూ చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ట్రంప్‌ విడుదల చేసిన వీడియోను కాపీరైట్‌ సమస్య పేరిట ట్విటర్‌ తొలిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విటర్‌ నిర్ణయంపై ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ట్విటర్‌ చర్యలు డెమోక్రట్స్‌కు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయన్నారు. ‘‘శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారికి ట్రంప్‌ సానుభూతి తెలుపుతున్నారు. వాళ్లు(ట్విటర్‌) రాడికల్‌ లెఫ్ట్‌ డెమోక్రట్స్‌ కోసం పోరాడుతున్నారు. ( బఫెట్‌ తప్పు చేశారు: ట్రంప్‌ )

ఒకరి పక్ష్యం వహిస్తున్నారు. సెక్షన్‌ 230 ప్రకారం ఇది అక్రమం’’ అంటూ ఓ పత్రిక ప్రచురించిన వార్తను ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. అనంతరం యూఎస్‌ లా ‘‘ఇంటరాక్టివ్‌ కంప్యూటర్‌ సర్వీస్‌’’ను గుర్తు చేశారు. అయితే దీనిపై ట్విటర్‌ వేదికగా స్పందించిన ట్విటర్‌ సీఈఓ జాక్‌ డోర్సే .. ‘‘  ట్రంప్‌ ట్వీట్‌పై కాపీరైట్‌ సమస్య వచ్చింది. ఓ వ్యక్తి దానిపై ఫిర్యాదు చేశాడు. అందుకే దాన్ని తొలిగించాము. ఆయన ఆరోపణలు నిజం కాదు.. అక్రమం అంతకంటే కాదు’’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు