ట్విట్టర్‌లో ఇక పదివేల క్యారెక్టర్స్!

6 Jan, 2016 10:04 IST|Sakshi
ట్విట్టర్‌లో ఇక పదివేల క్యారెక్టర్స్!

ట్విట్టర్లో ఎన్నో రోజులుగా ఊరిస్తున్న ఓ కొత్తమార్పు త్వరలో రానున్నట్టు సమాచారం. ఇప్పటివరకు ట్విట్టర్లో140 క్యారెక్టర్స్  మాత్రమే ట్వీట్ చేసే వీలుండేది. ఈ పరిమితిని 10 వేల క్యారెక్టర్స్కు పెంచాలని ట్విట్టర్ యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్క ట్వీట్లో కేవలం 140 క్యారెక్టర్స్ ఉండటంతో ఎక్కువ సమాచారాన్ని పంచుకునే అవకాశం ఉండేది కాదు. లిమిట్ పెంచడంతో అక్షరాలతో పాటు అధిక సంఖ్యలో ఫొటోలు, వీడియోలు, ఇతర లింకులను కూడా పంచుకునే వీలుంటుంది.

'ఎక్కువమంది ట్విట్టర్ వినియోగదారులు ఫోటోల ద్వారా ట్విట్టర్లో 140 క్యారెక్టర్ల కన్నా ఎక్కువ సమాచారాన్ని ఉపయోగించడాన్ని మేము గమనించాము. ట్విట్టర్ వినియోగదారుల కోసం కొత్త మార్పులను చేయడానికి మేము వెనకాడటం లేదు' అని ట్విట్టర్ కో ఫౌండర్ జాక్ డోర్సీ  ఇది వరకే చెప్పారు. డోర్సీ వచ్చిన కొన్నిరోజుల్లోనే ట్విట్టర్లో కొత్తగా చాలా మార్పులు చేశారు. మూమెంట్స్ ఫీచర్స్, పోల్స్ ఆప్షన్, బై బటన్, ఫేవరెట్ స్థానంలో (స్టార్), హార్ట్ షేప్లో ఉన్న లైక్ బటన్లను ఆయనే ప్రవేశపెట్టారు. 

మరోవైపు 140 క్యారెక్టర్లు మాత్రమే ఉండాలని గట్టిగా వాదించేవాళ్లు మంగళవారం #beyond140లో తమ అభిప్రాయాలను తెలిపారు. కొత్తగా క్యారెక్టర్ లిమిట్ పెంచితే ట్విట్టర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందని చాలామంది యూజర్స్ అభిప్రాయపడ్డారు. కొందరు ట్విట్టర్కు రిప్ (రెస్ట్ ఇన్ పీస్) అంటూ... ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తలు