ట్విట్టర్ నుంచి ఆప్షన్ తొలగింపు

28 Oct, 2016 01:21 IST|Sakshi
ట్విట్టర్ నుంచి ఆప్షన్ తొలగింపు

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఖాతాదారులకు అందించే సేవల నుంచి మరో ఆప్షన్‌ను తొలగిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. వైన్ ఆప్షన్‌ను త్వరలో తొలగించేందుకు నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆప్షన్ ద్వారా షార్ట్ ఫామ్ వీడియో షేరింగ్ సర్వీసును అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఖాతాదారులు ఈ వైన్ ఆప్షన్‌తో వీడియోలను షేర్, డౌన్‌లోడ్ చేసేందుకు  వినియోగిస్తున్నారు.

ట్విట్టర్ ఖాతాదారులకు వైన్ ఆప్షన్ ద్వారా విలువైన సేవలను అందిస్తోందని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్థిక కారణాలు, పని భారంతో పాటు ప్రధాన పొటీదారులైన ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్ నుంచి పోటీని తట్టుకోలేక ఇప్పటికే 9 శాతం ఉద్యోగులను తొలగించింది. ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ట్విట్టర్ను విక్రయించడానికి సన్నద్ధమైన కొనుగోలు చేసేందుకు ఏ కంపెనీ కూడా ముందుకు రాని విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు