ట్విట్టర్లో మహిళలకు పెద్దపీట

29 Aug, 2015 16:01 IST|Sakshi
ట్విట్టర్లో మహిళలకు పెద్దపీట

వాషింగ్టన్:   మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్  మరింత మంది మహిళలను తన సంస్థలో నియమించుకునేందుకు ప్రయత్నిస్తోందట. ఈ విషయాన్ని సంస్థ వైస్ ప్రెసిడెంట్ జానెట్ వ్యాన్ హౌసీ తన బ్లాగ్ స్పాట్లో షేర్ చేశారు. తద్వారా ఆయా రంగాల్లో ఉన్న లింగ వివక్షను రూపుమాపేందుకు  జరుగుతున్న తొలి ప్రయత్నమిది అని వ్యాఖ్యానించారు. స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించేందుకు తామీ నిర్ణయం తీసుకున్నామని ఆమె వెల్లడించారు. సాంకేతిక రంగంలో మహిళల ప్రాతినిధ్యం చాలా అవసరమని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుతం 4వేల మంది ఉద్యోగులుండగా ఇందులో  చాలా కొద్దిమంది మాత్రమే మహిళా ఉద్యోగులున్నారన్నారని ఆమె తెలిపారు. 2016 సంవత్సరానికి సాంకేతిక ఉద్యోగాల్లో 16 శాతం, మిగతా  రంగాల్లో 35 శాతం మహిళలను రిక్రూట్ చేసేందుకు యోచిస్తున్నామని  తెలిపారు.

తమ సంస్థ సాధించిన విజయం వెనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల కృషి, పట్టుదల చాలా ఉన్నాయన్నారు. ఇందుకు  తమకు చాలా సంతోషంగా ఉందని ఆమె వెల్లడించారు.  భవిష్యత్తులో తమ సంస్థ ద్వారా మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు  ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామంటూ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు