దుండగుడి కాల్పులు : ఇద్దరు ఖాకీల మృతి

20 Jan, 2020 08:15 IST|Sakshi

హవాయి : అమెరికాలోని హోనోలులులో ఆదివారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మరణించినట్లు హవాయి గవర్నర్ ఒక ప్రకటనలో తెలిపారు. తుపాకీతో ఓ వ్యక్తి హల్‌చల్‌ చేయడంతో అధికారులు అతడిని ఎదుర్కొనే క్రమంలో దుండగుడు కాల్పులు జరపడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదయం విధి నిర్వహణలో మరణించిన ఇద్దరు హోనోలులు పోలీసు అధికారులను కోల్పోవడం విషాదకరమని గవర్నర్ డేవిడ్ ఇగే చెప్పారు. హోనోలులు జంతుప్రదర్శనశాల, ప్రఖ్యాత డైమండ్ హెడ్ స్టేట్ మాన్యుమెంట్ మధ్య వైకికి బీచ్ వద్ద టూరిస్టులతో కోలాహలంగా ఉండే ప్రాంతంలో కాల్పులు జరగడంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. కాల్పులు జరిగిన భవంతి మంటల్లో చిక్కుకోవడంతో కలకలం రేగింది. భవన యజమాని దుండగుడిని ఖాళీ చేయాల్సిందిగా నోటీసు జారీ చేయడంతో ఘర్షణ జరిగిందని, ఇంటి యజమానిపై సైతం దుండగుడు కత్తితో దాడి చేసినట్టు సమాచారం.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా