న్యూజెర్సీలో అరుదైన రాటిల్‌ స్నేక్‌

6 Sep, 2019 10:47 IST|Sakshi

వాషింగ్టన్‌: న్యూజెర్సీ అడవుల్లో అరుదైన రెండు తలల రాటిల్‌ స్నేక్‌ జన్మించింది. గత నెల 25న బర్లింగ్టన్‌ కౌంటీలోని  హెర్పెటోలాజికల్ అసోసియేట్స్‌కు చెందిన ఇద్దరు ఉద్యుగులు ఈ అరుదైనన రాటిల్‌ స్నేక్‌ పిల్లను గుర్తించారు. దీని గురించి  హెర్పెటోలాజికల్ అసోసియేట్స్‌ సీఈవో  బాబ్‌ జప్పలోర్తి మాట్లాడుతూ.. ‘న్యూజెర్సీలో ఇలాంటి రెండు తలల రాటిల్‌ స్నేక్‌ కనిపించడం ఇదే ప్రథమం. కానీ ఇది ఎక్కువ రోజులు బతకలేదు.

పాకే సమయంలో ఏదైనా వేటాడే జీవి కంట పడితే అది దీన్ని చంపేస్తుంది. అంతే కాక ఈ రాటిల్‌ స్నేక్‌కు రెండు తలలు ఉండటం మూలానా రెండు మెదళ్లు ఉంటాయి. దాంతో రెండు తలలు స్వతంత్రంగా ఆలోచిస్తాయి. అంటే ఒకే పాము విభిన్న ఆలోచనలన్న మాట. ఫలితంగా మెదడుతో మిగతా శరీరం సమన్వయం కాలేక దానిపై అదే దాడి చేసుకునే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఇలాంటి జీవులు ఎక్కువ రోజులు బతకలేవు’ అన్నారు.

ఇలా రెండు తలల పాములు కనిపించడం చాలా అరుదు. కవల పిల్లలు పూర్తిగా విడిపోకుండా దేహాలు కలిసిపోయి తలలు మాత్రమే వేరుగా ఏర్పడినప్పుడు ఇలాంటి వింత రూపంతో జీవులు జన్మిస్తుంటాయి. మనిషి శరీరాన్ని నియంత్రించేది మెదడు. అలాంటి మెదళ్లు రెండు ఉండి.. మిగిలిన శరీరం అంతా ఒక్కటిగానే ఉంటే... ఏ మెదడు ఇచ్చిన సంకేతాలను మొదట అనుసరించాలో తెలియక శరీర భాగాలు తికమకపడే ప్రమాదం ఉంటుంది. ఒక తల ఇటు వెళితే.. ఇంకో తల అటు వెళ్లడానికి సిద్ధమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక్క శరీరంతో రెండు తలలు ఇచ్చే సూచనలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం చాలా కష్టం. అలా చేయకపోతే అవి జీవించడం కూడా కష్టమవుతుంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా