'మెలర్' దాటికి ఫిలిప్పీన్స్ ఛిన్నాభిన్నం

16 Dec, 2015 17:58 IST|Sakshi

మనీలా: పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన 'మెలర్' తుఫాను దాటికి ఫిలిప్పీన్స్ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే తుఫాను ప్రభావంతో 13 మంది మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. తుఫాను దాటికి వేలాది మంది నిరాశ్రయులుగా మారారని మిండోరో గవర్నర్ అల్ఫన్సో ఉమాలి తెలిపారు.

లక్షలాది మంది  ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో తలదాచుకుంటున్నారు. మెలర్ దాటికి ఫిలిప్పైన్స్ తూర్పు తీర ప్రాంతం తీవ్రంగా ప్రభావితమయింది. విద్యుత్ పంపిణీలో అంతరాయం ఏర్పడి ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపడుతోంది.
 

మరిన్ని వార్తలు