అంగారక​ గ్రహంపైకి అరబ్‌ మిషన్‌

20 Jul, 2020 12:30 IST|Sakshi

యూఏఈ హర్షాతిరేకం

టోక్యో : రెడ్‌ ప్లానెట్‌ గుట్టుమట్లను ఆవిష్కరించేందుకు అంగారక గ్రహానికి తొలి అరబ్‌ స్పేస్‌ మిషన్‌ హోప్‌ను జపాన్‌ నుంచి  ప్రయోగాత్మకంగా పరీక్షించారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) అభివృద్ధి చేసిన ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను సోమవారం ఉదయం జపాన్‌ రాకెట్‌ అంతరిక్షంలోకి విజయవంతంగా మోసుకెళ్లిందని అధికారులు తెలిపారు. అరబిక్‌లో అల్‌-అమల్‌గా పేరొందిన ఈ ప్రయోగం ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు వాయిదా పడింది. ప్రయోగం జరిగిన గంటతర్వాత స్పేస్‌క్రాఫ్ట్‌ రాకెట్‌ నుంచి విడిపోయి నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశించిందని రాకెట్‌ తయారీ సంస్థ మిట్సుబిషి హెవీ ఇండస్ర్టీస్‌ పేర్కొంది.

తమ స్పేస్‌మిషన్‌ యూఏఈ సహా ఈ ప్రాంతానికి కీలక మైలురాయి వంటిదని మహ్మద్‌ బిన్‌ రషీద్‌ స్సేస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ హమద్‌ అషియబని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి హోప్‌ అంగారక గ్రహంపై అడుగుపెడుతుందని భావిస్తున్నారు. అంగారక గ్రహంపైకి తొలి స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపడంపై యూఏఈ ప్రభుత్వం ట్విటర్‌లో స్పందిస్తూ ఇది అరబ్‌ ప్రాంతానికి గర్వకారణంతో పాటు సరికొత్త ఆశలు చిగురింపచేసేదని వ్యాఖ్యానించింది. హోప్‌ మిషన్‌ ప్లానెట్‌పై ప్రత్యేక అంశాలను ఆవిష్కరిస్తుందని మిషన్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఒమ్రన్‌ షరాఫ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 2021 సెప్టెంబర్‌లో హోప్‌ మిషన్‌ భూమండలానికి సమాచారాన్ని చేరవేస్తుందని, ఈ సమాచారం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు అథ్యయనం కోసం అందుబాటులో ఉండనుంది. చదవండి : అంగారక గ్రహ ఆనవాళ్లను కళ్ళకు కడుతూ...

మరిన్ని వార్తలు