నా భర్త అతి ప్రేమతో చచ్చిపోతున్నా..

23 Aug, 2019 16:04 IST|Sakshi

అబుదాబి: సాధారణంగా భార్యాభర్తలు ఎందుకు విడిపోతారు. అభిప్రాయబేధాలు వస్తేనో, వేధింపులు తట్టుకోలేకనో.. భార్యనో, భర్తనో మరో వ్యక్తితో సంబంధాలు పెట్టుకున్న సందర్భాల్లో విడిపోవాలని అనుకుంటారు. అయితే టెక్నాలజీ పెరిగాక వింత వింత కారణాలతో విడిపోతున్న జంటల సంఖ్య ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో మరో విడాకులు వివాదం అందర్ని తెగ ఆకర్షిస్తోంది. భర్త అతి ప్రేమతో తనకు ఊపిరాడటం లేదని.. విడాకులు ఇప్పించాలంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ వింత సంఘటన యూఏఈలో చోటు చేసుకుంది.

ఆ వివరాలు.. యూఏఈ లోని షరియత్ కోర్టుకు ఒక విడాకుల కేసు వచ్చింది. అయితే ఆ కేసు వివరాలు చదివి ఆశ్చర్యపోవడం జడ్జి వంతయ్యింది. తన భర్త అతి మంచితనం వల్ల తాను సరిగా కాపురం చేయలేకపోతున్నానని.. తనకు విడాకులు మంజూరు చేయాలని ఓ భార్య కోర్టులో కేసు వేసింది. తాను చెప్పిన పనేకాక చెప్పని పని కూడా చేస్తూ విసుగు తెప్పిస్తున్నాడని భర్తపై ఆరోపణలు చేసింది. దాంతో ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అని జడ్జి ప్రశ్నించారు.

అందుకు ఆమె ‘అసలు నా భర్త ఏ విషయంలోనూ నాతో గొడవపడడు. ఇంటిని సరిగా ఉంచకపోయినా, వంట బాగా చేయకపోయినా ఏమి అనడు. పైగా అప్పడప్పుడు తనే నాకు వండి పెడుతుంటాడు. ఇంటిని కూడా శుభ్రం చేస్తాడు, అంట్లు కడుగుతాడు, బట్టలు కూడా తానే వాషింగ్ మెషిన్లో వేసి ఆరేస్తాడు. నాకు పనేం చెప్పకపోగా బహుమతులతో నన్ను ముంచెత్తుతాడు. నాకు మా ఆయనతో గొడవ పడాలని, వాదించాలని ఉంటుంది. కానీ నేనేం చేసినా సరే తను ప్రేమతో క్షమిస్తూ ఉంటాడు. ఆయన అతి ప్రేమతో నాకు ఊపిరాడటం లేదు. అసలు గొడవలు లేకుండా జీవించడం నాకు నరకంలా ఉంది.  ఇలాంటి జీవితం నాకు వద్దు. విడాకులు ఇప్పించండి’ అని పేర్కొంది.

భార్య ఆరోపణలపై భర్తను ప్రశ్నించగా.. తనకు తన భార్యంటే చాలా ప్రేమని, ఆమెను కష్టపెట్టడం ఇష్టం ఉండదని బదులిచ్చాడు. తనతో నేను గొడవ పడలేనని అన్నాడు. గతంలో ఒక సారి తన భార్య తనను బరువు తగ్గమని చెప్పిందని.. వెంటనే కఠినమైన డైట్ ఫాలో అయి సన్నగా అయ్యానని చెప్పుకొచ్చాడు. భార్యతో గొడవపడటం తన వల్ల కాదని సదరు భర్త తేల్చి చెప్పాడు. వీరిద్దరి వాదనలు విన్న జడ్జి.. ఇది కోర్టులో విచారించదగిన కేసు కాదని.. దంపతులిద్దరూ కలసి కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. ప్రస్తుతానికి కేసును వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మీ ఫుట్‌బాల్‌ టీంకు భారత్‌లోనే అభిమానులు ఎక్కువ

చిదంబరం చేసిన తప్పు ఇదే..

ఒక్క టాబ్లెట్‌తో గుండె జబ్బులు మాయం!

కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వానికి ట్రంప్‌ సై

ఫ్రాన్స్‌ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ

అమెజాన్‌ తగులబడుతోంటే.. అధ్యక్షుడి వెర్రి కూతలు!

మా ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయి: వైరల్‌

ఇమ్రాన్‌కు షాక్‌.. బ్లాక్‌లిస్ట్‌లోకి పాక్‌

అంతర్జాతీయ వేదికపై పాక్‌కు మరో ఎదురుదెబ్బ

సెక్స్‌ వేధింపులపై ఇదో ‘ఫేస్‌బుక్‌’ ఉద్యమం

ఒక వైపు పెళ్లి విందు..మరోవైపు వైవాహిక జీవితం మొదలు

నేటి నుంచి ప్రధాని గల్ఫ్‌ పర్యటన

స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీకి ‘టైమ్‌’ గుర్తింపు

మోదీకి ఫ్రాన్స్‌లో ఘనస్వాగతం

‘పుట్టగానే పౌరసత్వం’ రద్దు!

‘మిస్‌ టీన్‌ ఆసియా వరల్డ్‌గా తెలుగమ్మాయి​

భారత్‌తో చర్చించే ప్రసక్తే లేదు: ఇమ్రాన్‌ ఖాన్‌

బంగారు రంగు చిరుతను చూశారా!

మందు తాగితే ఎందుకు లావెక్కుతారు?

వీడియో చూస్తుండగానే‌; ఎంత అదృష్టమో!

మంటల్లో ‘అమెజాన్‌’; విరాళాలు ఇవ్వండి!

నీ స్కర్టు పొట్టిగా ఉంది.. ఇంటికి వెళ్లిపో..

ప్రాణం పోకడ చెప్పేస్తాం!

ప్రకటనలపై ఫేస్‌బుక్‌ నియంత్రణ

కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి రెడీ

ఇక క్లోనింగ్‌ పిల్లి కూనలు మార్కెట్లోకి

ఈనాటి ముఖ్యాంశాలు

ఆత్మహత్య కోసం ఆమె దూకితే.....

ఎంపీ బిడ్డకు పాలు పట్టిన స్పీకర్; ప్రశంసలు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నువ్వు అద్భుతమైన నటివి: హృతిక్‌

‘సాహో’ రన్‌ టైమ్‌ ఎంతంటే..?

ఎస్వీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న చిరు

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

మా సింబా వచ్చేశాడు : ప్రముఖ హీరో

‘ఉక్కు మహిళ’గా విద్యాబాలన్‌