ఉబర్‌కు ఎదురుదెబ్బ‌.. 30 తర్వాత రోడ్లపైకి నో!

22 Sep, 2017 17:17 IST|Sakshi
ఉబర్‌కు ఎదురుదెబ్బ‌.. 30 తర్వాత రోడ్లపైకి నో!

లండన్‌ : ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ఉబర్‌కు చుక్కెదురైంది. లండన్‌లో తన లైసెన్స్‌ కోల్పోయింది. దీంతో 40 వేల మంది డ్రైవర్ల భవిష్యత్‌ గందరగోళంలో పడనుంది. ఈ నెల సెప్టెంబర్‌ 30 తర్వాత ఉబర్‌ సంస్థ తన క్యాబ్‌లను లండన్‌ నగరంలో తిప్పడానికి వీల్లేదంటూ లండన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ రెగ్యులేటర్‌ సంస్థ స్పష్టం చేసింది. ట్రాన్స్‌పోర్ట్‌ ఫర్‌ లండన్‌ నిబంధనల ప్రకారం.. ఉబర్‌ క్యాబ్‌ల నిర్వహణ తీరు లేదని వ్యాఖ్యానించింది.

కార్పొరేట్‌ తరహా బాధ్యతలు నిర్వహించడంలో వెనుకబాటుతోపాటు ముఖ్యంగా ప్రయాణీకుల భద్రత విషయాన్ని ఉబర్‌ పట్టించుకోలేదని, తాము సూచించిన భద్రతా పరమైన చర్యలు తీసుకోలేదని పేర్కొంది. కాగా, ఈ నిర్ణయంపై అప్పీల్‌ చేసుకొనే హక్కు ఉబర్‌ సంస్థకు ఉంది. 21 రోజుల్లో ఈ అపీల్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే, లండన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఉబర్‌ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే ఈ సంస్థకు వ్యతిరేకంగా పలు యూనియన్లు, చట్టప్రతినిధులు, నల్లజాతికి చెందిన డ్రైవర్ల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

>
మరిన్ని వార్తలు