చర్చలతోనే పరిష్కారం​ : బోరిస్‌ జాన్సన్‌

25 Jun, 2020 12:46 IST|Sakshi

తీరు మార్చుకోని డ్రాగన్‌

లండన్‌ : సరిహద్దు వివాదాన్ని భారత్‌, చైనాలు చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పిలుపు ఇచ్చారు. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయని, ఈ పరిణామాలు ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. భారత్‌-చైనాల మధ్య నెలకొన్న పరిణామాలను బ్రిటన్‌ నిశితంగా గమనిస్తోందని బోరిస్‌ జాన్సన్‌  పేర్కొన్నారు. కాగా, సరిహద్దు ఉద్రిక్తతలను నివారించేందుకు సేనల ఉపసంహరణపై భారత్‌, చైనా సైనికాధికారుల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైనా డ్రాగన్‌ దూకుడు తగ్గడం లేదు. చర్చల్లో శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు తూర్పు లడఖ్‌ సహా వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో బలగాలను మోహరిస్తూనే ఉంది. చదవండి : బాయ్ కాట్ చైనా : సీఏఐటీ మరో అడుగు

మరిన్ని వార్తలు