పాక్‌ ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాల్సిందే : బ్రిటన్‌

4 Mar, 2019 11:29 IST|Sakshi

లండన్‌ : పాక్‌ ఉగ్రవాద సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిదేనంటూ బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే సూచించారు. పుల్వామా ఉగ్ర దాడులు - మెరుపు దాడుల ఫలితంగా భారత్‌ - పాక్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థెరిసా, ఆదివారం ఇమ్రాన్‌ ఖాన్‌తో మాట్లాడారు. ఈ విషయం గురించి బ్రిటన్‌ ప్రధాని కార్యలయ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ప్రధాని థెరిసా మే పాక్‌ పీఎం ఇమ్రాన్‌ ఖాన్‌తో మాట్లాడారు. భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ను విడుదల చేయడం పట్ల  ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను చక్కదిద్దేందుకు పాక్‌ ప్రధాని చూపిన చొరవను థెరిసా స్వాగతించారు. అంతేకాక ఉగ్రవాద సంస్థల పట్ల పాక్‌ కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని.. పాక్‌ కూడా ఇందుకు మద్దతు ఇవ్వాలని థెరిసా, ఇమ్రాన్‌ ఖాన్‌కు తెలిపారన్నా’రు.

పుల్వామా ఉగ్ర దాడిలో 40 మంది జవాన్ల మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి కారణమైన జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థను యూకే 2001లోనే బ్యాన్‌ చేసింది. బాలాకోట్‌ మెరుపు దాడి అనంతరం థెరిసా మే పరిస్థితులను గమనిస్తున్నామని.. తాము ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడుతున్నామని తెలిపారు. భారత్‌ - పాక్‌ దౌత్యపరమైన విధానాలతో ముందుకు వెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని థెరిసా కోరారు. (మసూద్‌ బతికేఉన్నాడు : పాక్‌ మీడియా)

>
మరిన్ని వార్తలు