బ్రెగ్జిట్‌కు జూన్‌ 30 దాకా గడువివ్వండి

21 Mar, 2019 05:11 IST|Sakshi

లండన్‌: యురోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలిగేందుకు జూన్‌ 30 వరకు గడువు ఇవ్వాలని బ్రిటన్‌ ఈయూ నాయకులను కోరింది. ఈ మేరకు ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్‌ టస్క్‌కు లేఖ రాసినట్లు బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే బుధవారం పార్లమెంట్‌లో చెప్పారు. జూన్‌ 30కి మించి గడువు కోరుకోవడం లేదని, అంతకన్నా ఆలస్యమైతే మే నెల చివరన ఈయూ పార్లమెంట్‌ ఎన్నికలను బ్రిటనే నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా, గురువారం, శుక్రవారం బ్రసెల్స్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశంలో ఈయూ సభ్య దేశాలు బ్రిటన్‌ వినతిపై ఏకాభిప్రాయంతో ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. 

మరిన్ని వార్తలు