ఉక్రెయిన్‌ ప్రధాని రాజీనామా!

18 Jan, 2020 03:40 IST|Sakshi
ఉక్రెయిన్‌ ప్రధాని ఓలెక్సీ గోంచారక్‌

ఆడియో లీకుల ప్రభావమే కారణం 

కీవ్‌: ఉక్రెయిన్‌ ప్రధాని ఓలెక్సీ గోంచారక్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధ్యక్షుడు వ్లోదిమర్‌ జెలెన్‌స్కీకి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆర్థిక వ్యవస్థపై వ్లోదిమర్‌కు అంతగా అవగాహన లేదని ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో రికార్డులు ఇటీవల లీకయ్యా యి. దీనికి బాధ్యత వహి స్తూ శుక్రవారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాను తిరస్కరిస్తు న్నట్లు అధ్యక్షుడు వ్లోదిమర్‌ తెలిపారు. ప్రధానికి మరో అవకాశమిస్తున్నట్లు చెప్పారు.ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇటీవల వ్లోదిమర్‌ ఆ దేశ బ్యాం కు అధికారులు, ఆర్థికవేత్తలతో భేటీ అయ్యారు.  సమావేశం అనంతరం ఓలెక్సీ మాట్లాడుతూ.. ‘వ్లోదిమర్‌ ఓ కమెడియన్‌. ఆయనకు ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేదు. రాజకీయంగా ఆయనకు ఎలాంటి అనుభవం లేదు’అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు