వారి వేతనం ముందు ప్రధాని పే ప్యాకేజ్‌ దిగదుడుపే..

15 Apr, 2020 20:00 IST|Sakshi

లండన్‌ : బ్రిటన్‌లో నార్త్‌ లనార్క్‌షైర్‌ కౌన్సిల్‌ అధికారిగా వ్యవహరించిన జనిస్‌ హెవిట్‌ దేశంలోనే అత్యధిక వేతనం పొందే కౌన్సిల్‌ అధికారిగా నిలిచారు. బ్రిటన్‌లో 2018, 2019లో అత్యధిక వేతనం పొందిన స్ధానిక అధికారిగా హెవిట్‌ ముందున్నారని ట్యాక్స్‌పేయర్స్‌ అలయెన్స్‌ వెల్లడించింది. 6,00,000 పౌండ్లకు పైగా (రూ 5.7 కోట్ల) వేతనం అందుకున్న ఆమె పే ప్యాకేజ్‌ బ్రిటన్‌ ప్రధాని అందుకునే వేతనం కంటే నాలుగు రెట్లు అధికం. ఇక పోర్ట్‌సిటీగా పేరొందిన చిన్న నగరం గ్లాస్గో రెండు చేతులా సంపాదించే టాప్‌ ఎగ్జికూటివ్స్‌ జాబితాలో మాత్రం దూసుకువెళుతోంది. టాక్స్‌పేయర్స్‌ అలయెన్స్‌ వెల్లడించిన వేతన వివరాల జాబితాలో డజను మంది గ్లాస్గో బాసులే ఎడాపెడా సంపాదిస్తూ ముందువరుసలో నిలిచారు.

2018-19 గణాంకాల ప్రకారం గ్లాస్గోకు చెందిన వారే ఏటా 150000 పౌండ్లకు (రూ 1.4 కోట్లు) పైగా రాబడితో అత్యధిక వేతనం పొందే వారిలో అత్యధికులున్నారని వెల్లడైంది. గ్లాస్గో నగరపాలక మండలికి చెందిన వేదికలను నిర్వహించే స్కాటిష్‌ ఈవెంట్స్‌ క్యాంపస్‌కు చెందని ఆరుగురు డైరెక్టర్లూ ఈ జాబితాలో ఉన్నారు. అయితే వీరు ప్రజాధనం నుంచి తమ వేతనాలు పొందకపోవడం గమనార్హం. కౌన్సిల్‌ వేదికలో జరిగే కార్యకలాపాలు, వేడుకల ద్వారా వచ్చే రాబడి నుంచి పెద్దమొత్తంలో వేతనాలను పొందుతున్నారు. స్కాటిష్‌ ఈవెంట్స్‌ క్యాంపస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ 1,79,477 పౌండ్ల (రూ 1.8 కోట్లు) వేతనంతో గ్లాస్గో జాబితాలో​ టాప్‌లో నిలిచారు. ఇతర ఖర్చులతో కలిపి ఆయన ఏకంగా 261000 పౌండ్ల(రూ 2.5 కోట్లు) వేతనం పొందుతున్నారు. ఎడిన్‌బర్గ్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సెంటర్‌ బాస్‌ మార్షల్‌ దల్లాస్‌ మొత్తం ప్యాకేజ్‌ 1,89,000 పౌండ్లు (రూ 1.7 కోట్లు) పైమాటే.

చదవండి : ‘అక్కడ 20,000 మరణాలు’

మరిన్ని వార్తలు