'సూసైడ్ బాంబర్ కావాలనుంది'

30 Nov, 2015 20:52 IST|Sakshi
'సూసైడ్ బాంబర్ కావాలనుంది'

లండన్: ఐఎస్ఐఎస్ తొలి మహిళా సూసైడ్ బాంబర్ కావాలని ఉందని బ్రిటన్కు చెందిన 46 ఏళ్ల సాలీ జోన్స్ సోషల్ మీడియాలో హడలెత్తిస్తోంది. బ్రిటీష్ మీడియా 'మిసెస్ టెర్రర్'గా పేర్కొనే సాలీ జోన్స్ గతంలో సిరియాకు పారిపోయి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని పెళ్లి చేసుకుంది. అమెరికా వైమానిక దాడిలో ఆమె భర్త హతమయ్యాడు. ఆ తర్వాత సూసైడ్ బాంబర్గా మారాలనుకున్న జోన్స్ ఇప్పుడు అమెరికా దళాలకు లక్ష్యంగా మారింది.  

సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించే సాలీ జోన్స్ అమెరికాను హెచ్చరిస్తూ తరచూ పోస్ట్ చేస్తుంటుంది. భద్రతకు ముప్పుగా మారిన సాలీ జోన్స్ కోసం అమెరికా దళాలు వెంటాడుతున్నాయి. డ్రోన్ దాడుల్లో జోన్స్ను హతమార్చాలని లక్ష్యంగా చేసుకున్నాయి. ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఆమె కూడా ఉంది. 2010లో చెచెన్యాలో రష్యా దళాలపై ఆత్మాహుతి దాడి చేసిన హవా బరయెవ్ను ప్రశంసించే జోన్స్ ఆమెలా అమెరికా దళాలపై దాడి చేయాలనుకుంటున్నట్టుగా బ్రిటీష్ మీడియా వెల్లడించింది.
 

మరిన్ని వార్తలు