ఇమ్రాన్‌కు ఐరాస షాక్‌

11 Sep, 2019 19:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై నానా రాద్ధాంతం చేస్తున్న పాకిస్తాన్‌కు ఐక్యరాజ్యసమితి (ఐరాస) నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్‌ వ్యవహారం భారత్‌-పాకిస్తాన్‌లకు సంబంధించిన అంశమని, ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గటరీస్‌ ఉద్దేశమని ఐరాస ప్రతినిధి స్టీఫెన్‌ డుజరిక్‌ స్పష్టం చేశారు.

జమ్మూ కశ్మీర్‌ వ్యవహారాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించి భారత్‌ను టార్గెట్‌ చేయాలన్న పాకిస్తాన్‌, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌లకు ఐరాస ప్రకటన మింగుడుపడటం లేదు. కశ్మీర్‌ భారత అంతర్గత వ్యవహారమని, మూడవ పార్టీ జోక్యం అవసరం లేదన్న భారత్‌ వాదనకు అనుకూలంగా ఐరాస స్పందించడంతో పాక్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఐరాస చీఫ్‌ ఇరు దేశాధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నా ఇరు పక్షాలు చర్చల ద్వారా కశ్మీర్‌ సమస్యను పరిష్కరించుకోవాలని, మధ్యవర్తిత్వానికి చోటులేదనే భావిస్తున్నారని స్టీఫెన్‌ తేల్చిచెప్పడం భారత్‌ వాదనను బలపరిచినట్టయింది.

మరిన్ని వార్తలు