భారత్కు చోటు కల్పించాలి: మోదీ

26 Sep, 2015 18:35 IST|Sakshi
భారత్కు చోటు కల్పించాలి: మోదీ

న్యూయార్క్ :  ఐక్యరాజ్యసమితిలోని కీలకమైన విభాగమైన భద్రతామండలిలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు చోటు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. జీ4 దేశాల సదస్సు శనివారం న్యూయార్క్లో ప్రారంభమైంది. ఈ సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ ఐరాసలో సంస్కరణలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

నిర్దిష్ట కాలపరిమితిలో ఐరాస సంస్కరణలు అమల్లోకి తేవాలని ఆయన అన్నారు. తీవ్రవాదం, పర్యావరణ కాలుష్యం ప్రపంచానికి పెనుసవాళ్లు విసురుతున్నాయని మోదీ వ్యాఖ్యానించారు.  ప్రపంచ శాంతికి జీ4 దేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ దేశాలను కలుపుకోవాలని...పొంచి ఉన్న సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకుపోవాలని పిలుపునిచ్చారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా