‘అమెరికా గతాన్ని మర్చిపోయింది’

6 Jan, 2018 11:34 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : అమెరికాపై పాకిస్తాన్‌ ధిక్కార ధోరణిని ప్రదర్శిస్తోంది. అగ్రరాజ్యం బెదిరింపులు లొంగేది లేదని... పాక్‌ మరోసారి స్పష్టం చేసింది.  మత స్వేచ్ఛ ఉల్లంఘనలు, ఉగ్రవాదం వంటి అంశాలపై అమెరికా చేసిన వ్యాఖ్యలపై పొరుగుదేశం ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. వాషింగ్టన్‌నుంచి వచ్చే ప్రతి ఆదేశాన్ని పాటించలేమని పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్‌ ముహమ్మద్‌ ఫైజల్‌ స్పష్టం చేశారు. ఏకపక్షంగా డెడ్‌లైన్లను విధించడం, బెదిరింపులకు దిగడం వంటివి ఇరుదేశాల సంబధాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయని ఆయన చెప్పారు.  

పరస్పర గౌరవం, ఒకరిమీదొకరికి నమ్మకం, నిలకడ, ఓర్పు ఉన్నపుడే దౌత్యసంబంధాలు కొనసాగుతాయని.. అవి లేనప్పుడు బంధం కొనసాగడంలో అర్థం లేదని చెప్పారు. ఉగ్రవాదంపై యుద్ధంలో అమెరికాకు పాక్‌ సహకరించిందని.. మా దేశం ఎవరిమీద సమయం చేయలేదన్న విషయానని గుర్తుంచుకుని మాట్లాడాలన్నారు. అమెరికా భద్రత కోసం మేం ప్రయత్నించాము.. మా రక్షణ కోసం వాషింగ్టన్‌ చేసిన ప్రయత్నాలు ఏమీ లేవని ఆయన చెప్పారు. ఆల్‌ఖైదా సహా పలు ఉగ్రవాద సంస్థలను సమూలంగా నాశనం చేయడంతో మేం చేసిన సహాయాన్ని అమెరికా మర్చిపోయిందని ఆయన అన్నారు. 

మత స్వేచ్ఛకు ఇబ్బంది లేదు:
మత స్వేచ్ఛ ఉల్లంఘనల విషయంలో అమెరికా పాకిస్థాన్‌ను ‘ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన జాబితా’లో చేర్చిన విషయం తెలిసిందే. దీనిపై డాక్టర్‌ ముహమ్మద్‌ ఫైజల్‌ అసహనం వ్యక్తం చేశారు. ఏఏ కారణాలతో పాకిస్తాన్‌ను ఈ జాబితాలో చేర్చారో చెప్పాలని ఆయన అన్నారు. మా దేశంలో మత స్వేచ్ఛ ఉంది.. అందువ్లలే అందరూ ఉండగలుగుతున్నారని చప్పారు.  ఇదిలావుండగా.. మత స్వేచ్ఛ ఉల్లంఘనల అంశంలో 10దేశాలను అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్‌సన్‌ ‘ప్రత్యేక ఆందోళనకర దేశాలు’గా హోదా మార్చారు.

మరిన్ని వార్తలు