నిద్రాణ గెలాక్సీలో కృష్ణబిలాల జంట...

24 Apr, 2014 05:15 IST|Sakshi
నిద్రాణ గెలాక్సీలో కృష్ణబిలాల జంట...

మనకు 200 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో.. క్రియా రహితంగా ఉన్న ‘ఎస్‌డీఎస్‌ఎస్ జే120136’ అనే గెలాక్సీ కేంద్రంలోని రెండు అతి శక్తిమంతమైన కృష్ణబిలాల(బ్లాక్‌హోల్స్) ఊహాచిత్రమిది. ఆ గెలాక్సీ కేంద్రంలోని ఓ నక్షత్రం వీటి ప్రభావానికి ముక్కలైపోగా.. దాని నుంచి ఇవి వాయువులను ఇలా పీల్చేసుకుంటున్నాయట. చిత్రంలో ఓ కృష్ణబిలం వైపుగా వెళుతున్న వాయువులను మధ్యలో మరో కృష్ణబిలం పీల్చేసుకోవడం చూడొచ్చు. ఇప్పటిదాకా ఇలాంటి కృష్ణబిలాల జంటలు క్రియాశీలకంగా ఉండే గెలాక్సీల్లోనే గుర్తించగా.. క్రియారహితమైన గెలాక్సీలోనూ కనుగొనడం ఇదే తొలిసారి. వీటిని చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ పరిశోధకుడు ఫుకున్ లీయూ కనుగొన్నారు.

మరిన్ని వార్తలు