‘ఫిబ్రవరి 14న సిస్టర్స్‌ డే’

15 Jan, 2019 12:06 IST|Sakshi

లాహోర్‌: ఫిబ్రవరి 14 అనగానే అందరికీ గుర్తొచ్చేది వాలెంటైన్స్‌ డే. అలాంటిది వాలెంట్‌న్స్‌ డే నిర్వహించడాన్ని పాకిస్తాన్‌కు చెందిన ఓ యూనివర్సిటీ తప్పుపట్టింది. ఆ రోజున వాలెంటైన్స్‌ డే కు బదులు సిస్టర్స్‌ డే జరపాలనే నిర్ణయం తీసుకుంది. ఫైసలాబాద్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వైఎస్‌ చాన్సలర్‌ జాఫర్ ఇక్బాల్‌ రణ్‌ధవా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇతర బోర్డు సభ్యులు కూడా ఆమోదించారు. పాక్ సంస్కృతితోపాటు, ఇస్లాం సంప్రదాయాన్ని పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జాఫర్‌ తెలిపారు. సిస్టర్స్‌ డేలో భాగంగా ఫిబ్రవరి 14న మహిళలకు స్వార్ఫ్‌లు, దుస్తులు బహుమతిగా ఇవ్వాలని అన్నారు. 

దీనిపై జాఫర్‌ మాట్లాడుతూ.. ‘సిస్టర్‌ డే నిర్ణయం విజయవంతం అవుతుందో కాదో తెలియదు. ముస్లింలకు వాలెంటైన్స్‌ డే వల్ల ప్రమాదం పొంచి ఉంది. కానీ ఈ ముప్పును కూడా అవకాశంగా మలచుకోవాలి. మహిళల పట్ల మాకు చాలా గౌరవం ఉంది. మహిళ సాధికారతను మరచిపోకూడదు. సోదర సోదరిమణుల బంధం కంటే ప్రేమ గొప్పదా?. పాశ్చాత్య సంస్కృతి వెంట పరుగెత్తకుండా జాగ్రత్త వహించాల’ని అన్నారు.

కాగా, వాలెంటైన్స్‌ డే వేడుకలను జరపడంపై పాక్‌లో చాలా కాలంగా వివాదం కొనసాగుతుంది. మెజారిటీ ప్రజలు ఇందుకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నారు. 2017, 2018లలో  వాలెంటైన్స్‌ డే జరపడాన్ని ఇస్లామాబాద్‌ హైకోర్టు నిషేధించింది. అలాగే అందుకు సంబంధించి ఎలాంటి వార్తలను ప్రచురించకూడదని ప్రింట్‌, ఎలక్ర్టిక్‌ మీడియాకు ఆదేశాలు జారీ చేసింది.


 

మరిన్ని వార్తలు