నేడు ఐరాస రహస్య చర్చలు

16 Aug, 2019 04:08 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత్‌ రద్దు చేయడంపై  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అరుదైన సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశాన్ని శుక్రవారం ఉదయం గోప్యంగా నిర్వహించనున్నట్లు దౌత్యవేత్తలు తెలిపారు. చైనా విజ్ఞప్తి మేరకు ఈ విధంగా రహస్య సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో ఐరాసలో బహిరంగ చర్చను నిర్వహింపజేయడంలో పాక్‌ విఫలమైనట్లయింది. భద్రతా మండలికి ప్రస్తుతం రొటేషన్‌ పద్ధతిలో చీఫ్‌గా ఉన్న పోలండ్‌ అంశంపై ఉదయం పది గంటలకు చర్చ నిర్వహించేలా లిస్టింగ్‌ చేసిందని వారు చెప్పారు. కశ్మీర్‌ అంశంపై భద్రతా మండలి చర్చించడం చాలా అరుదన్నారు.

మరిన్ని వార్తలు