41 కోట్ల యూజర్ల వివరాలు లీక్‌

6 Sep, 2019 01:35 IST|Sakshi

ఫేస్‌బుక్‌ మరో నిర్వాకం  

వాషింగ్టన్‌: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మరో వివాదంలో చిక్కుకుంది. ఫేస్‌బుక్‌ సర్వర్లలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగా 41.9 కోట్ల మంది యూజర్ల వివరాలు బయటకు పొక్కాయని టెక్‌ క్రంచ్‌ అనే మీడియా సంస్థ తెలిపింది. ఇందులో 13.3 కోట్ల మంది అమెరికన్లు ఉండగా, 5 కోట్ల మంది వియత్నామీలు, 1.8 కోట్ల మంది బ్రిటిషర్లు ఉన్నారని వెల్లడించింది. ఈ ఘటనలో యూజర్ల ఫోన్‌ నంబర్లు, లింగం, నివాస ప్రాంతం తదితర వివరాలు బయటకు వచ్చేశాయని పేర్కొంది. సంబంధిత ఫేస్‌బుక్‌ సర్వర్‌కు పాస్‌వర్డ్‌ రక్షణ లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందనీ, దీనివల్ల ఎవరైనా ఈ సర్వర్‌ నుంచి యూజర్ల పూర్తివివరాలను తీసుకునేందుకు వీలుకలిగిందని చెప్పింది. ఈ విషయాన్ని తాము ఫేస్‌బుక్‌ దృష్టికి తీసుకొచ్చామని తెలిపింది. మరోవైపు ఈ విషయమై ఫేస్‌బుక్‌ స్పందిస్తూ.. దాదాపు 20 కోట్ల యూజర్ల వివరాలు బయటపడ్డాయనీ, ఈ సమాచారమంతా చాలా పాతదని వివరణ ఇచ్చింది.

మరిన్ని వార్తలు