త్రీడీ డ్రెస్.. అదుర్స్..!

15 Dec, 2014 04:28 IST|Sakshi
త్రీడీ డ్రెస్.. అదుర్స్..!

ఆధునిక ఫ్యాషన్ ప్రపంచం సరికొత్త శిఖరాలకు చేరుకుందని చెప్పడానికి ఈ భామ వేసుకున్న డ్రెస్సే నిదర్శనం. దీనిని త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించారు. అతివల శరీరాకృతికి సరిగ్గా సరిపోయేలా దుస్తులు రూపొందించడం ఈ విధానం ప్రత్యేకత. తొలుత యువతి శరీరాకృతిని త్రీడీ స్కానింగ్ చేస్తారు.

అనంతరం ఆమెకు నచ్చిన డిజైన్‌తో సరిగ్గా ఒంటికి సరిపోయేలా త్రీడీ ప్రింటర్ ద్వారా డ్రెస్ ప్రింట్ చేసి ఇచ్చేస్తారు. అమెరికా మసాచుసెట్స్‌కు చెందిన ఓ డిజైన్ స్టూడియో ఈ వినూత్న ఆవిష్కరణ చేసింది. ఒక్క డ్రెస్‌ను ప్రింట్ చేయడానికి 48 గంటల సమయం పడుతుందని, ఇందుకు 3వేల డాలర్లు (దాదాపు రూ.1.80 లక్షలు) ఖర్చవుతుందని దీని రూపకర్తలు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు