హోంల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ అనూహ్య రాజీనామా

12 Oct, 2019 11:38 IST|Sakshi

యుఎస్ యాక్టింగ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ కెవిన్ మెక్‌లీనన్ రాజీనామా

వాషింగ్టన్: అమెరికా యాక్టివ్‌ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ కెవిన్ మెక్‌లీనన్ అనూహ్యంగా  పదవి నుంచి వైదొలిగారు. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కెవిన్ మెక్‌లీనన్ హోంల్యాండ్ సెక్యూరిటీ యాక్టింగ్ సెక్రటరీగా అత్యుత్తమ సేవలందించారంటూ ఆయనకు ట్రంప్‌ అభినందనలు తెలిపారు. చాలా ఏళ్లపాటు పాటు ప్రభుత్వానికి సేవలించిన  కెవిన్ ఇపుడు తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని, ప్రైవేటు రంగానికి వెళ్లాలని కోరుకుంటున్నరాని ఆయన ట్వీట్‌ చేశారు.  చాలా మంది అద్భుతమైన అభ్యర్థులున్నారనీ, వచ్చే వారం కొత్త యాక్టింగ్ సెక్రటరీని ప్రకటిస్తానని ట్రంప్‌ పేర్కొన్నారు. వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్  మెక్‌లీనన్‌ సేవలను ప్రశంసిస్తూ  ట్వీట్‌ చేశారు.  అటు తన  రాజీనామా విషయాన్ని కెవిన్‌ కూడా ట్విటర్‌ ద్వారా ధృవీకరించారు. 

కాగా మాజీ డిహెచ్ఎస్ కార్యదర్శి కిర్స్ట్‌జెన్ నీల్సన్ రాజీనామా చేసిన తరువాత ఏప్రిల్‌లో మెక్‌లీనన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డిహెచ్‌ఎస్) యాక్టింగ్ చీఫ్‌గా ఎన్నికయ్యారు. అక్రమ వలసదారులను దక్షిణ సరిహద్దు నుండి యుఎస్‌లోకి ప్రవేశించకుండా నిరోధించే దూకుడు ప్రచారాన్ని పర్యవేక్షించిన మెక్‌లీనన్, ఇటీవల తన ఉద్యోగల బాధ్యతలపై  మీడియా ద్వారా తన నిరాశను వ్యక్తం చేశారు. దీనికి తోడుగా వైట్ హౌస్ అతన్ని శాఖ కార్యదర్శిగా నామినేట్ చేయడానికి ఇష్టపడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు  సమాచారం.  

>
మరిన్ని వార్తలు