అమెరికా: మాస్క్‌ లేకపోతే ఇకపై ప్రయాణాలు నిషేధం

3 Jul, 2020 17:27 IST|Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఒకే రోజు 50వేలకు పైగా  కరోనా కేసులు  కూడా నమోదయ్యాయి. ప్రపంచంలోనే కరోనా కేసుల్లో, మరణాల్లో అగ్రరాజ్యం మొదటిస్థానంలో ఉంది. అయినప్పటికీ మే, జూన్‌ నెలలో దేశంలో విమానాల ద్వారా ప్రయాణలు చేసిన వారి సంఖ్య పెరింగింది అని ది ట్రాన్స్‌పోర్షన్‌  సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ నివేదిక ప్రకారం తెలుస్తోంది. అయితే ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యత అంటున్న ఎయిర్‌లైన్స్‌ మాస్క్‌లు ధరించే విషయంలో కఠిన నిబంధనలు అమలుచేస్తున్నాయి. వీటిని పాటించని ప్రయాణీకుల మీద కొంత కాలం పాటు నిషేధం కూడా విధించనున్నాయి. (అమెరికా: ఒక్కరోజే 54 వేల కరోనా కేసులు)

అమెరికాలో ప్రముఖ అంతర్జాతీయ విమాన సంస్థలైన అమెరికన్‌ ఎయిర్‌ లైన్స్‌,  డెల్టా ఎయిర్‌లైన్స్‌, ఫ్రంటియర్‌ ఎయిర్‌లైన్స్‌, జెట్‌ బ్ల్యూ ఎయిర్‌లైన్స్‌, సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌, స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్, యూనిటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ అన్ని కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న  క్రమంలో కొన్ని నిబంధనలు విధిస్తున్నాయి. ప్రయాణీకులందరూ వారి కచ్చితంగా ముక్కు, నోరు కవర్‌ అయ్యేలా మాస్క్‌ ధరించాలని సూచిస్తున్నాయి. బోర్డింగ్‌ దగ్గర, లాంజ్‌ దగ్గర, విమానం ఎక్కేటప్పుడు, ప్రయాణించేటప్పుడు కచ్చితంగా మాస్క్‌ ధరించే ఉండాలని నిబంధనలలో పేర్కొన్నాయి. మాస్క్‌లేని వారికి ఎయిర్‌ లైన్స్‌లోనే ఇచ్చే వెసులుబాటును కల్పిస్తున్నాయి.

వారికి తినేటప్పుడు, తాగేటప్పుడు మాత్రం మాస్క్‌ ధరించడం నుంచి వెసులుబాటు కల్పించాయి. రెండు సంవత్సరాల లోపు పిల్లలు, ఆరోగ్యంగా సరిగా లేనివారికి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నవారికి దీని నుంచి మినహాయింపులు ఇచ్చారు. ఒక వేళ ఈ నిబంధనలు ఉల్లంఘించే ప్రయాణీకుల మీద ఈ ఎయిర్‌లైన్స్‌ తాత్కలికంగా నిషేధం విధించనున్నాయి. మాస్క్‌ ధరించేందుకు నిరాకరించిన కన్సర్వేటివ్‌ పార్టీ నేతను న్యూయార్క్‌లో విమానం ఎక్కకుండా అడ్డుకున్నసంగతి తెలిసిందే. (‘బ్యాన్‌ టిక్‌టాక్’‌ అమెరికాలోనూ..!)

మరిన్ని వార్తలు