శుత్రుదుర్భేద్యంగా రాష్ట్రపతి, ప్రధాని విమానాలు

8 Feb, 2019 04:38 IST|Sakshi

భారత్‌కు ఆధునిక క్షిపణి నిరోధక వ్యవస్థలను అమ్మేందుకు అమెరికా అంగీకారం

వాషింగ్టన్‌: అత్యాధునిక క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థలు రెండింటిని భారత్‌కు విక్రయించేందుకు అగ్రరాజ్యం అమెరికా ఆమోదం తెలిపింది. ఈ రెండింటి విలువ సుమారు రూ.1,355 కోట్లుగా ఉండనుంది. ఈ కొనుగోళ్ల ద్వారా రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణించే విమానాలకు అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. లార్జ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇన్‌ఫ్రారెడ్‌ కౌంటర్‌మెజర్స్, సెల్ఫ్‌ ప్రొటెక్షన్‌ సూట్స్‌గా పిలిచే ఈ వ్యవస్థల అమ్మకానికి సంబంధించి ట్రంప్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు అమెరికా డిఫెన్స్‌ సెక్యూరిటీ కోఆపరేషన్‌ ఏజెన్సీ తెలిపింది.

భారత రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణించే ఎయిరిండియా వన్‌ విమానాలకు ఈ ఆధునిక వ్యవస్థలను అమర్చితే అమెరికా అధ్యక్షుడి ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంతో సమానమైన పటిష్టమైన భద్రత కలుగుతుంది. ఈ వ్యవస్థలను అమర్చేందుకు 2 బోయింగ్‌–777 ఈఆర్‌ విమానాలను ఎయిరిండియా నుంచి కొననున్నారు. ప్రమాద సమయంలో మధ్యశ్రేణి క్షిపణి వ్యవస్థలపై దానంతటదే ప్రతిదాడి చేయడం ఈ వ్యవస్థ ప్రత్యేకతల్లో ఒకటి. ఈ కొనుగోళ్లలో ప్రధాన కాంట్రాక్టర్‌ బోయింగ్‌ కంపెనీ.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా