మహమ్మారి కట్టడిలో ముందడుగు

3 Jun, 2020 14:16 IST|Sakshi

జోరుగా క్లినికల్‌ ట్రయల్స్‌

వాషింగ్టన్‌ : ఈ ఏడాది చివరికి కరోనాకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందని యూఎస్‌ ఆర్మీ వ్యాక్సిన్‌ పరిశోధకులు వెల్లడించారు. సంవత్సరాంతానికి కరోనాను కట్టడి చేసే ఏదో ఒక వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులో ఉంటుందని సైనిక అంటువ్యాధుల పరిశోధన కార్యక్రమం డైరెక్టర్‌ కల్నల్‌ వెండీ సమన్స్‌ జాక్సన్‌ పేర్కొన్నారు. మరోవైపు కరోనా మహమ్మారి నియంత్రణకు ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్‌ను తీసుకువచ్చేలా ప్రైవేట్‌ సంస్ధలతో కలిసి ప్రభుత్వం పనిచేస్తోందని అమెరికా రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ వెల్లడించారు.

మరోవైపు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ఆస్ర్టాజెనెకాతో కలిసి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై మూడో దశ పరీక్షలకు రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్‌ దిశగా చేస్తున్న ప్రయోగాలు కీలక దశకు చేరుకుంటున్నాయి.ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 60 లక్షలు దాటగా, భారత్‌లో కరోనా కేసులు రెండు లక్షల మార్క్‌ను అధిగమించాయి.

చదవండి : ‘కరోనాకు మందు‌ కనిపెట్టా.. అనుమతివ్వండి’

మరిన్ని వార్తలు