యెమెన్ లో అమెరికా దాడులు

30 Jan, 2017 03:14 IST|Sakshi

41 మంది ఉగ్రవాదులు సహా 57 మంది మృతి
అదెన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా ఓ దేశం (యెమెన్ )పై ఆ దేశ భద్రతా దళాలు దాడులకు పాల్పడ్డాయి. యెమెన్ లో జరిగిన ఈ దాడుల్లో 41 మంది అనుమానిత అల్‌కాయిదా ఉగ్రవాదులు, 16 మంది సాధారణ పౌరులు మృతి చెందినట్లు ఆ దేశ అధికార వర్గాలు వెల్లడించాయి.

బైదా సెంట్రల్‌ ప్రావిన్స్ లోని యక్లా జిల్లాలో జరిగిన ఈ దాడుల్లో 8 మంది మహిళలు, 8 మంది చిన్నపిల్లలు సహా మొత్తం 57 మంది మృత్యువాత పడ్డారు. అల్‌కాయిదా బడులు, మసీదులు, వైద్య ప్రాంతాల్లో కూడా దాడులు నిర్వహించారు. ఈ ప్రాంత అల్‌కాయిదా చీఫ్‌ అబు బరాజన్  కూడా దాడుల్లో చనిపోయినట్లు అధికారులు చెప్పారు. దాడుల్లో తమ సైనికుడు ఒకరు మృతి చెందాడని అమెరికా పేర్కొంది.గత 24 గంటల్లో 100 మంది రెబల్స్‌ను హతమార్చామని యెమెన్‌ ఆర్మీ చెప్పింది.  

మరిన్ని వార్తలు