యూఎస్‌కు తప్పిన మరో షట్‌డౌన్‌ ముప్పు

13 Feb, 2019 08:10 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వానికి నిధులు మంజూరు చేసి తద్వారా మరో షట్‌డౌన్‌ను నివారించడంపై డెమొక్రాట్లు, రిపబ్లికన్లు సోమవారం సాయంత్రం సూత్రప్రాయంగా ఓ ఒప్పందానికి వచ్చారు. అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడను నిర్మించేందుకు 5.7 బిలియన్‌ డాలర్ల నిధులు కావాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన డిమాండ్‌ను వారు పక్కనబెట్టారు. ట్రంప్‌ అడిగినట్లుగా కాకుండా కేవలం 1.375 బిలియన్‌ డాలర్లనే ఇచ్చేందుకు వారు అంగీకరించారు.

ఈ ఒప్పందం కుదరకపోయుంటే శుక్రవారం నుంచి అమెరికాలో మళ్లీ షట్‌డౌన్‌ ప్రారంభమై ఉండేది. వాషింగ్టన్‌లో సోమవారం సాయంత్రం ఇరు పార్టీలకు చెందిన చట్ట సభ్యులు రహస్య సమావేశంలో పాల్గొన్నారు. ఒప్పందం గురించిన విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. గోడ విషయంలో డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్ర విభేదాలు వచ్చిన కారణంగా ఇటీవలే అమెరికా ప్రభుత్వం 30 రోజులకు పైగా షట్‌డౌన్‌ కావడం తెలిసిందే. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు