అమెరికాలో 161 మంది భారతీయులు అరెస్ట్‌!

18 May, 2020 11:16 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన 161 మంది భారతీయులను యూఎస్‌ఏ వెనక్కి తిప్పి పంపించనుంది. వీరందరూ మెక్సికో బోర్డర్‌ నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారు.  తప్పుడు మార్గంలో దేశంలోకి ప్రవేశించిన కారణంగా వారిని ఇమ్మిగ్రేషన్‌  అధికారులు అరెస్ట్‌ చేశారు. వారిని ప్రత్యేకమైన విమానం ద్వారా పంజాబ్‌లోని అమృత్‌సర్‌కి పంపించనున్నారు. వీరిలో అత్యధికంగా 76 మంది హర్యానా నుంచి వెళ్లగా , తరువాతి స్ధానంలో పంజాబ్‌ నుంచి 56 మంది, గుజరాత్‌ నుంచి 12 మంది, ఉత్తరప్రదేశ్‌ నుంచి 5 మంది, మహారాష్ట్ర నుంచి నలుగురు, కేరళ, తెలంగాణ, తమిళనాడు నుంచి ఇద్దరు చొప్పున వెళ్లగా ఆంధ్రప్రదేశ్‌, గోవా నుంచి ఒక్కొక్కరు వెళ్లారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వీరిలో హర్యానా నుంచి వెళ్లిన 19 యేళ్ల యువకుడు కూడా ఉన్నాడు.  (తెలుగు బాలికను సత్కరించిన ట్రంప్.. )

దాదాపు అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన 1739 మంది భారతీయులు ప్రస్తుతం 95 జైళ్లలో మగ్గుతున్నారని నార్త్‌ అమెరికన్‌ పంజాబ్‌ ఆసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సత్నామ్‌ సింగ్‌ చహల్‌ తెలిపారు. 2018లో 611 మందిని అమెరికా దేశం నుంచి తిప్పి పంపించేయగా, 2019లో ఈ సంఖ్య రెండున్నర రెట్లు పెరిగి 1616కి  చేరుకుందని తెలిపారు. నార్త్‌ ఇండియాలో ముఖ్యంగా పంజాబ్‌లో ఇలా మనుషులను అక్రమంగా విదేశాలకు పంపిస్తూ ఉంటారని తెలిపారు. ఇలాంటి ఏజెంట్‌లు ఒక్కొక్కరి నుంచి 35 నుంచి 50 లక్షలు తీసుకొని వారిని ఇతర దేశాల్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రోత్సహిస్తారని చహల్‌ తెలిపారు. ఈ విషయంలో పంజాబ్‌ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎవరూ కూడా ఇలాంటి వారి చేతుల్లో మోసపోవద్దని చహల్‌ కోరారు.  (స్వతంత్ర దర్యాప్తు: భారత్ సహా 62 దేశాల మద్దతు!)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు