క‌రోనా బాధితుడు కోలుకున్నాడోచ్‌

10 Apr, 2020 20:52 IST|Sakshi

ప్ర‌పంచ దేశాల‌కు ముచ్చెమట‌లు ప‌ట్టిస్తున్న కోవిడ్‌-19(క‌రోనా వైర‌స్‌) అంత‌కంత‌కూ తీవ్ర‌త దాలుస్తోంది. త‌న‌కు కుల‌, మ‌త‌, వ‌ర్గ‌, జాతి బేధాలు లేవంటూ అంద‌రినీ బ‌లి తీసుకుంటోంది. ఈ మ‌ర‌ణ మృదంగాన్ని ఆప‌డానికి వైద్యులు ఆ ర‌క్క‌సితో యుద్ధ‌మే చేస్తున్నారు. రోగుల‌కు చికిత్స అందించే క్ర‌మంలో వైద్యులు, న‌ర్సులు, సిబ్బంది కూడా పలు చోట్ల ఆ ప్రాణాంతక వైర‌స్ బారిన ప‌డ‌టం క‌ల‌వ‌రప‌రిచే అంశం. అయినప్ప‌టికీ వేటినీ లెక్క చేయ‌క ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడ‌ట‌మే త‌మ అంతిమ‌ క‌ర్త‌వ్యంగా రేయింబవ‌ళ్లు శ్ర‌మిస్తున్నారు. ఇక అగ్ర‌రాజ్యం అమెరికా విష‌యానికొస్తే అటు ప్ర‌జ‌లు, ఇటు వైద్యులు వైర‌స్ దెబ్బ‌కు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. (వర్క్‌ ఫ్రం హోమ్‌: లైవ్‌లో రిపోర్టర్‌.. బాత్రూంలో నుంచి..)

తాజాగా అమెరికాలోని ఓ ఆసుప‌త్రిలో క‌రోనా బాధితుడు దాన్నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. దీంతో అత‌న్ని కాపాడిన డాక్ట‌ర్ల ఆనందం అంతా ఇంతా కాదు. వెంట‌నే విశ్వాన్ని జ‌యించినంత ఆనందంతో ఆసుప‌త్రిలో అంద‌రూ డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ఆ ఐసీయూ బందంలోని ఓ వైద్యురాలు ఏప్రిల్ 6న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ముప్పైవేల మందికి పైగా వీక్షించిన ఈ వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. "మీరు రియ‌ల్ హీరోలు", "మీ ఆనంద‌రం చూస్తుంటే మ‌న‌సు కాస్త తేలిక‌గా ఉంది" అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. (హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానాలు..)

>
మరిన్ని వార్తలు