అమెరికా ఎంబసీపై రాకెట్‌ దాడి

27 Jan, 2020 06:50 IST|Sakshi

బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీకి సమీపంలో రాకెట్‌ దాడి జరిగింది. మూడు కత్యూష రాకెట్లు ఎంబసీ హై సెక్యూరిటీ కాంపౌండ్‌ వద్ద పడ్డాయని ఒకరు చెప్పగా, దాదాపు 5 రాకెట్లు పడ్డాయని మరొక సాక్షి తెలిపారు. అయితే హై సెక్యూరిటీ గ్రీన్‌ జోన్‌ వద్ద 5 రాకెట్లు పడ్డాయని ఇరాక్‌ భద్రతా బలగాలు అధికారికంగా ప్రకటించాయి. అయి తే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపాయి. ఈ ప్రాంతంలో ఇతర దేశాలకు సంబంధించిన ఎంబసీలు కూడా ఉన్నా యి. రెండు రోజుల క్రితమే బాగ్దాద్‌లో అమెరికా బలగాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిగింది. ఇరాన్‌ జనరల్‌ సులేమానీని అమెరికా హతమార్చినప్పటి నుంచి ఈ ప్రాంతంలో అస్థిరత నెలకొంది.

మరిన్ని వార్తలు