స్వలింగ వివాహాలకు అమెరికా కోర్టు ఓకే!

13 Nov, 2014 07:47 IST|Sakshi

కాన్సాస్ రాష్ట్రంలో స్వలింగ వివాహాలకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. దాంతో అక్కడున్న మొత్తం 50 రాష్ట్రాలలో ఇలా స్వలింగ వివాహాలను ఆమోదించిన 33వ రాష్ట్రంగా నిలిచింది. తమ రాష్ట్రంలో ఇలాంటి పెళ్లిళ్లను ఆమోదించవద్దంటూ అక్కడ కొంతమంది ప్రజలు చేసిన విజ్ఞప్తులను కోర్టు తిరస్కరించింది. న్యాయమూర్తులలో ఆంటోనిన్ స్కాలియా, క్లారెన్స్ థామస్ అనే ఇద్దరు మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మిగిలిన వాళ్లంతా ఓకే చెప్పారు.

ఆరు రాష్ట్రాల్లో కూడా స్వలింగ వివాహాలను ఆమోదిస్తున్నట్లు అధ్యక్షుడు బరాక్ ఒబామా గత నెలలో ప్రకటించడంతో అప్పటివరకు 26గా ఉన్న ఈ రాష్ట్రాల సంఖ్య 32కు పెరిగింది. ఇప్పుడు కాన్సాస్ 33వ రాష్ట్రం అయ్యింది. త్వరలోనే దక్షిణ కరొలినా రాష్ట్రం కూడా దీన్ని ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. స్వలింగ వివాహాలను రద్దు చేయాలనడం రాజ్యాంగ విరుద్ధమని అక్కడి న్యాయమూర్తి ఒకరు వ్యాఖ్యానించారు. దానిపై అప్పీలు జరగనుంది.

మరిన్ని వార్తలు