ట్రంప్‌ అభిశంసన ప్రక్రియకు లైన్‌ క్లియర్‌

1 Nov, 2019 05:16 IST|Sakshi

వాషింగ్టన్‌: అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన ప్రక్రియ చేపట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అధికార రిపబ్లికన్ల కంటే డెమోక్రాట్లదే పైచేయిగా ఉన్న ప్రతినిధుల సభలో గురువారం 232–196 ఓట్ల తేడాతో తీర్మానం నెగ్గింది. ట్రంప్‌ తన రాజకీయ ప్రత్యర్థి జో బిడెన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ      జరిపించాలంటూ నిధుల మంజూరును సాకుగా చూపి ఉక్రెయిన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై బహిరంగ విచారణ జరిపించాలని, అధ్యక్షుడిని అభిశంసించాలని ప్రతిపక్షం పట్టుబడుతోంది. 

మరిన్ని వార్తలు